టీడీపీలో ప్రస్తుతం లీడర్ షిప్ ఫైట్ జరుగుతోంది. అధినేత చంద్రబాబు నాయుడు హటాత్తుగా స్కిల్ స్కామ్ లో జైలుపాలు కావడంతో ఆయన స్థానాన్ని పార్టీలో ఎవరు భర్తీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీడీపీ జాతీయ కారదర్శిగా నారా లోకేశ్ ఉన్నప్పటికి ఆయన చుట్టూ కూడా స్కామ్ లు అలుముకుంటున్నాయి. పోలిటికల్ సర్కిల్స్ లో వినిపిస్తున్న సమాచారం ప్రకారం నారా లోకేశ్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయట. దీంతో టీడీపీని లీడ్ చేసే భాద్యత ఎవరు తీసుకుంటారనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరమైన ప్రశ్నగా ఉంది. అయితే చంద్రబాబు స్థానాన్ని భర్తీ చేసేందుకు నందమూరి భాలకృష తెగ ఆరాటపడుతున్నాట్లు తెలుస్తోంది. .
పార్టీ కార్యలయంలో చంద్రబాబు సీట్లో కూర్చోవడం, అసెంబ్లీలోనూ బాబు సీట్లో కూర్చోవడం, గతంతో పోల్చితే అసెంబ్లీలో తన వాదన వినిపించేందుకు మొగ్గు చూపుతుండడం.. ఇలాంటి చేస్తే టీడీపీకి తదుపరి లీడర్ తానే అనే సంకేతాలను ఇస్తున్నారు బాలకృష్ణ. అయితే బాలయ్య నాయకత్వంలో ముందుకు నడిచేందుకు పార్టీలో చాలమంది నేతలు విముఖత చూపిస్తున్నారట. ఎందుకంటే ఆయన ఎప్పుడు ఎలా వ్యవహరిస్తారో అర్థం కాదని వాపోతున్నారట. అందుకే నారా బ్రహ్మణికి పార్టీ పగ్గాలు ఇవ్వాలని టీడీపీలో సీనియర్ నేతలు భావిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే పార్టీలో ఒక వర్గం మాత్రం జూ. ఎన్టీఆర్ టీడీపీలోకి రావాలని గట్టిగా ఆశిస్తున్నారట. తాత పార్టీకి తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని, పార్టీకి తన అవసరం పడితే తప్పని సరిగా వస్తానని జూ. ఎన్టీఆర్ గతంలోనే వ్యాఖ్యానించారు. దీంతో ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తే టీడీపీ తిరిగి గాడిన పడుతుందనేది కొందరి అభిప్రాయమట. అయితే జూ.ఎన్టీఆర్ రాకను పార్టీలోని సీనియర్ నేతలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు టాక్. ఇటీవల అచ్చెనాయుడు జూ. ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. తాము ఎవరిని స్పందించమని కోరమని ఎవరి అవసరత పార్టీకి లేదని పరోక్షంగా ఎన్టీఆర్ ను ఉద్దేశించి చెప్పుకొచ్చారు. నందమూరి బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ పార్టీలోకి రావడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నారా బ్రహ్మణి పార్టీలో యాక్టివ్ అయితే ఇక ఎన్టీఆర్ టీడీపీలోకి రావడం కష్టమే అనే వాదన వినిపిస్తోంది. మరి ముందు రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:కళ్యాణ్ రామ్.. ‘డెవిల్’కోసం!