బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 3 వారాలు పూర్తి చేసుకోవడానికి వస్తోంది. మూడో వారం నామినేషన్స్‌లో మొత్తం ఏడుగురు కంటెస్టెంట్స్ ఉండగా అమర్ దీప్ చౌదరి, ప్రిన్స్ యావర్, గౌతమ్ కృష్ణ, రతిక, దామిని, శుభ శ్రీ రాయగురు ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.
ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ప్రిన్స్‌కి పట్టం కట్టారు. పుట్టుకతోనే నటుడ్ని అంటూ విర్రవీగుతున్న సీరియల్ హీరో అమర్ దీప్‌ని.. మిగిలిన సీరియల్ బ్యాచ్‌ని తుక్కు తుక్కు చేస్తూ ఓటింగ్‌లో టాప్‌లోకి దూసుకొచ్చాడు. శుక్రవారం అర్ధరాత్రితో ఓటింగ్ లైన్స్ ముగుస్తుండగా.. ప్రిన్స్ యావర్ 22 శాతం ఓట్లతో నెంబర్ వన్ స్థానంలో ఉంటే.. 20 శాతం ఓట్లతో గౌతమ్ కృష్ణ రెండో స్థానంలో ఉన్నాడు.
అమర్ దీప్ చౌదరి 18 శాతం ఓట్లతో మూడో స్థానానికి పడిపోయాడు. ప్రియాంక జైన్ 16 శాతం ఓట్లతో నాలుగో స్థానంలో ఉండగా.. 14 శాతం ఓట్లతో సీజన్ 7 స్నేక్.. రతిక ఐదో స్థానంలో ఉంది. ఇక ఆరు, ఏడు స్థానాల్లో దామిని, శుభ శ్రీ రాయగురు ఎలిమినేషన్‌కి పోటీ పడుతున్నారు. శుభ శ్రీకి.. 5 శాతం ఓట్లు పడితే.. ఎక్స్పోజింగ్ సింగర్ దామినికి 3 శాతం ఓట్లు పడ్డాయి. దీంతో ఈవారం దామిని ఎలిమినేట్ కావడం ఖాయంగా కనిపిస్తుంది.
Also Read:తంతిరం..రిలీజ్ డేట్ ఫిక్స్