పంటినొప్పి అనేది కొన్ని సందర్భాల్లో అతిగా వేధించే సమస్య. పిప్పి పన్ను ఉండడం, పండు పుచ్చిపోవడం, లేదా చిగుళ్ళ వాపు ఉండడం, ఇలాంటి లక్షణాల వల్ల విపరీతమైన పంటినిప్పి ఏర్పడుతుంది. ఈ పంటినొప్పి ఉన్న వారి బాధ వర్ణనాతీతం. ఏ పదార్థాన్ని తినలేరు. కాస్త చల్లటి నీరు త్రాగిన, వెచ్చని నీరు త్రాగిన జివ్వుమంటూ పంటినొప్పి నాశలానికి ఎక్కుతుంది. దాంతో పంటినొప్పిని తగ్గించుకునేందుకు ఎన్నో మెడిసన్స్ తీసుకుంటూ ఉంటారు. అయిన నొప్పి నుంచి ఉపశమనం మాత్రం లభించదు. అయితే ఎన్ని మెడిసన్స్ వాడిన తగ్గని పంటినొప్పిని కొన్ని సాధారణ చిట్కాలతో దూరం చేసుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు..
పిప్పి పంటి నొప్పితో బాధపడే వారికి బత్తాయి చక్కటి పరిష్కారం చూపుతుందట. బత్తాయి తోనలను బాగా నమిలి తినడం వల్ల నోట్లో ని బ్యాక్టీరియా తగ్గుతుంది. అందువల్ల పిప్పి పంటినొప్పి తగ్గుతుంది. ఇక పండు పుచ్చిపోయిన వారు నోట్లో ఉప్పు నీరు పోసుకొని పుక్కిలించడం వల్ల పుచ్చుపండులోని బ్యాక్టీరియా, క్రిములు అన్నీ నశిస్తాయి. ఎందుకంటే ఉప్పు క్రిమిసంహారిణిగా పని చేస్తుంది. తద్వారా పంటినొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
Also Read:ప్రధాని మోడీ బర్త్ డే..ఒకే చోట 74 మొక్కలు
ఇక హైడ్రోజన్ పెరాక్సైడ్ కూడా పంటి నొప్పిని తగ్గించడంలో ఎంతగానో ఉపయోగ పడుతుంది.చిగుళ్ళ వాపు, చిగుళ్ళ నుంచి రక్త స్రావం, వంటి వాటిని తగ్గించి పంటినొప్పి నుంచి విముక్తి కలిగేలా చేస్తుంది. వెల్లుల్లి, లవంగం వంటి వాటిని నోటి సంబంధిత సమస్యలకు ఔషధంగా పూర్వం నుంచి కూడా ఉపయోగిస్తున్నారు. వెల్లుల్లి రెబ్బకు కొద్దిగా ఉప్పు కలుపుకొని చూర్ణంలా చేసి పంటినొప్పి కలిగే చోట అప్లై చేస్తే పంటినొప్పి నుంచి విముక్తి కలుగుతుంది. లవంగం యొక్క నూనె కూడా పంటినొప్పిని సమర్థవంతంగా నివారిస్తుంది. లవంగం నూనె లేదా లవంగం పొడిని పంటినొప్పి కలిగే చోట పెడితే నొప్పి తగ్గుతుందట. ఇలా ఇంటి చిట్కాల ద్వారానే ఎంతగానో బాధించే పంటినొప్పి సమస్య నుంచి విముక్తి పొందవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.