ఆసియా కప్ తరువాత నేడు టీమిండియా మరియు ఆస్ట్రేలియా జట్లు మూడు వన్డేల సిరీస్ కోసం తొలి మ్యాచ్ ఆడనున్నాయి. మద్యాహ్నం 1:30 ప్రారంభం కానున్న ఈ మ్యాచ్ పంజాబ్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. వరల్డ్ కప్ కు ముందు భారీ మార్పుల తో బరిలోకి దిగుతున్న టీమిండియా.. తొలి మ్యాచ్ లో గెలిసి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని చూస్తోంది. అటు ఆసీస్ కూడా తొలి మ్యాచ్ గెలుపు కోసం గట్టిగానే కసరత్తులు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మద్య టాస్ కీలకం గా మారనుంది. .
టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. టీమిండియా బ్యాటింగ్ విభాగం పటిష్టంగానే ఉన్నప్పటికి ప్రస్తుతం ఓపెనర్స్ పై సస్పెన్స్ కొనసాగుతోంది. స్టార్ ఓపెనర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి రెండు మ్యాచ్ లకు దూరం కానున్నాడు. ఈ నేపథ్యంలో ఓపెనర్స్ గా బరిలోకి ఎవరు దిగుతారనేది సస్పెన్స్ గా మారింది. ఆల్రెడీ శుబ్ మన్ గిల్ ఓపెనర్ గా సత్తా చాటుతున్నాడు. ఇక అతనితో ఇషన్ కిషన్ బరిలోకి దిగితే మేలని కొందరి అభిప్రాయం. అయితే కిషన్ ఓపెనర్ గా వస్తే మిడిలార్డర్ లో బలమైన ఆటగాళ్ల కొరత ఏర్పడుతుంది. దాంతో ఋతురాజ్ గైక్వర్డ్ ను బరిలోకి దించే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. అయితే ఇంటర్నేషనల్ మ్యాచ్ లలో గైక్వర్డ్ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు.
దాంతో ఓపెనర్ గా గైక్వర్డ్ ను పంపిస్తారా అనేది ప్రఃశ్నార్థకమే. ఇక టాప్ ఆర్డర్ లో శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్ వంటి వారు ఫామ్ లోకి రావాల్సి ఉంది. ఈ ఇద్దరు గత కొన్నాళ్లుగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. ముఖ్యంగా టి20 లలో నెంబర్ ఒన్ ప్లేయర్ గా ఉన్న సూయకుమార్ యాదవ్ వన్డేలలో మాత్రం తడబడుతున్నాడు. దాంతో ఈ మూడు వన్డేల సిరీస్ ద్వారా ఫామ్ లోకి వస్తే వరల్డ్ కప్ లో సత్తా చాటే అవకాశం ఉంది. ఇక చాలా రోజుల తరువాత అశ్విన్ తిరిగి జట్టులోకి వచ్చాడు. వరల్డ్ కప్ కు ముందు అశ్విన్ ప్రదర్శన ఎలా ఉండబోతుందో చూడాలి. మరి తొలి మ్యాచ్ లో భారీ మార్పులతో బరిలోకి దిగుతున్న టీమిండియా ఎలాంటి ప్రదర్శన కనబరుస్తుందో మరి.
Also Read:మొబైల్ డేటాను సేవ్ చేసే సూపర్ టిప్స్!