ఈ అమ్మడు చీర విప్పితే…

270
Lavanya Tripathi Wants To Do Younger And Vibrant Roles
- Advertisement -

సాధారణంగా స్ర్కీన్‌ మీద బికినీ వేయవలసి వస్తే, అదేదో తాము కోరి వేసుకన్న కాస్ట్యూమ్‌ కాదనీ, కథ డిమాండ్‌ చేస్తేనే బికినీలో కనిపిస్తామని, ఇలా రకరకాల కారణాలు చెబుతుంటారు హీరోయిన్లు. కానీ ఇలాంటి వంకలేవీ చెప్పడంలేదు ఆ హీరోయిన్‌. తనకి ఏది అనిపిస్తే అది మొహమాటం లేకుండా చెప్పేస్తోంది.

అయితే ఆ భామకి చీర బోర్‌ కొడుతోందట. వెంటనే తన ఒంటిమీద ఉన్న చీరని విప్పేస్తుందట. అంతేకాదు ఆమె చీర విప్పితే…చూసి తట్టుకోలేరని కూడా అంటోంది. ఎందుకోగానీ.. ఆ అమ్మడు  తన  చీరని విప్పేయడానికి తెగ ఆరాట పడుతోంది.
 Lavanya Tripathi Wants To Do Younger And Vibrant Roles
అవునండీ…నిజం. ఆ హీరొయిన్‌ కి ఛాన్స్‌ దొరికితే చాలు చీర విప్పేస్తానంటోంది.  ఏంటీ.. మరీ ఇంత బోల్డ్‌ గా  మాట్లాడిన ఆ హీరొయిన్‌ ఎవరు అనేగా మీ డౌట్‌..? ఇలా బోల్డ్ గా స్టేట్ మెంట్ ఇచ్చిన ఆ భామే లావణ్య త్రిపాఠి. తాను చీర విప్పడానికి రెడీగా ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇంతకీ తన ఉద్దేశ్యం ఏంటంటే…చీర విప్పి మోడ్రన్‌ డ్రెస్‌ లో కనిపించాలని ఆరాటపడుతోందట.  అందుకే  వాటికి తగ్గట్టు ఉండే పాత్రల కోసం ఈభామ తెగ ఎదురుచూస్తోంది.  తెలుగు ప్రేక్షకులకు అచ్చమైన తెలుగమ్మాయిలా కనిపించింది లావణ్య.
Lavanya Tripathi Wants To Do Younger And Vibrant Roles
అయితే  ఇలా కనిపించడం వల్లే ఈ అమ్మడు ఇప్పుడు ఇబ్బందిగా ఫీలౌతోంది.  ఎంతకాలమని ఇలా గ్లామర్‌ రోల్స్‌ కి దూరంగా ఉండాలి అనుకుందో ఏమో.. ఇక చీర విప్పేయడానికి డిసైడైపోయింది. అయితే ఈ అమ్మడుని  దర్శక నిర్మాతలు  గ్లామర్‌ రోల్స్‌ కి ఎక్కువగా  ప్రిఫర్‌ చెయ్యకపోవడంతో…  తన అందాలన్నీ చీరలోనే దాగి ఉన్నాయని తెగ బాధపడిపోతోంది.

అంతేకాకుండా  సినిమాల్లో నిండుగా చీరలు కట్టుకుంటాను కానీ బయట కాదు . ఇంట్లో కానీ ఇతర ఫంక్షన్స్ కి కానీ మోడ్రన్ గా వెళతాను అంటూ నొక్కి మరీ చెబుతోంది లావణ్య . మరి ఇప్పటికైనా తన మనసులో మాటని బయటపెట్టిన లావణ్యను  ఏ దర్శక నిర్మతలు ద్రుష్టిలో పెట్టుకొని  ఆఫర్లిస్తారో చూడాలి.

- Advertisement -