టైగర్ నట్స్ తింటే ఎన్ని ప్రయోజనాలో..!

50
- Advertisement -

మన శరీరానికి పోషకాలను అందించడంలో డ్రై నట్స్ ఎంతగానో ఉపయోగ పడతాయి. బాదం, జీడిపప్పు, వాల్ నట్స్.. వీటన్నిటిని కూడా డ్రై నట్స్ గానే పరిగణించవచ్చు. అయితే డ్రై నట్స్ లో టైగర్ నట్స్ కూడా మనశరీరానికి సమృద్దిగా పోషకాలను అందించగలిగిన పదార్థాలే. వీటిని కొన్ని ప్రాంతాలలో చూఫా విత్తనాలు అని కూడా పిలుస్తారు. చూడడానికి ఇవి శనగల రూపంలో ఉన్నప్పటికి వీటికి మించిన పోషకాలు ఇందులో ఉంటాయి. టైగర్ నట్స్ లో అధికంగా ఫైబర్ ఉంటుంది. అలాగే స్టార్చ్ అనే పదార్థం కూడా ఉంటుంది. ఇవి జీర్ణ క్రియను మెరుగు పార్టుస్తాయి. ఇక టైగర్ నట్స్ లో ఒలిక్ యాసిడ్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

ఇంకా ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఫ్లెవనాయిడ్లు శరీరంలోని క్యాన్సర్ కరకాలను ఎదుర్కొనే శక్తిని ఇస్తాయి. టైగర్ నట్స్ లో రక్తంలో షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేసే గుణాలు కూడా ఉంటాయి. అందువల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇవి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇంకా ఇందులో మెగ్నీషియం, కాల్షియం, వంటి సూక్ష్మ పోషకాలు కూడా ఉంటాయి. ఇవి ఎముకల దృఢత్వాన్ని పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. టైగర్ నట్స్ లో రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు కూడా సమృద్దిగా ఉంటాయి. కాబట్టి టైగర్ నట్స్ ను డైలీ స్నాక్స్ రూపంలో తీసుకుంటే ఎంతో మంచిది. అయితే ఇవి తినడానికి కాస్త గట్టిగా ఉంటాయి. అందువల్ల వీటిని పొడిగా చేసుకొని ప్రతిరోజూ పాలలో కలుపుకొని తాగితే శరీరానికి అవసరమైన అన్నీ పోషకాలు లభిస్తాయి.

Also Read:చైతు ఎఫైర్ పై ‘సమంత’కు ప్రశ్న

- Advertisement -