బాలయ్య షో నుంచి బిగ్ అప్‌డేట్

24
- Advertisement -

బాలకృష్ణ హోస్ట్‌గా చేసిన షో ‘అన్‌స్టాపబుల్’. ఈ షో భారీ విజయాన్ని అందుకుంది. సినిమా సెలబ్రిటీలు మాత్రమే కాకుండా రాజకీయ నాయకులతో కూడా బాలయ్య ఇంటర్వ్యూలు చేశాడు. ఇప్పటి వరకు రెండు సీజన్‌లు విజయవంతంగా పూర్తిచేసుకున్న ఈ ‘అన్‌స్టాపబుల్’ 3వ సీజన్ త్వరలోనే ప్రారంభం కానుందట. ఈ సారి చిరంజీవి, నాగార్జున లు ఇందులో పాల్గొనబోతున్నారని తెలుస్తోంది. అలాగే, ఈ సీజన్‌లో మంత్రి కేటీఆర్ కూడా అతిథిగా రానున్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి.

కానీ, ఈ సీజన్ 3 ఎప్పుడు ప్రారంభం కానుందనే విషయంపై అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది. గత సీజన్లలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ అతిథులుగా వచ్చిన విషయం తెలిసిందే. మరోవైపు చంద్రబాబు అరెస్టు వల్ల బాలకృష్ణ సినిమా ఆగిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. బాలయ్య డైరెక్టర్‌ బాబీతో చేయాల్సిన సినిమా చంద్రబాబు అరెస్టుతో బ్రేకులు పడినట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం బాలయ్య చేస్తున్న ‘భగవంత్‌ కేసరి’ చిత్రం మాత్రం అనుకున్న డేట్ కే రిలీజ్ అవుతుందట.

Also Read:చైతు ఎఫైర్ పై ‘సమంత’కు ప్రశ్న

డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో రిలీజ్‌కు ఇంకా నెలరోజులు సమయం ఉండగా ఇప్పటినుంచే మేకర్స్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేసినట్టు తెలుస్తోంది. మొట్ట మొదటిగా బుల్లితెర ఆడియెన్స్‌ని టార్గెట్ చేస్తూ.. మూవీ యూనిట్ ఓ తెలుగు ఛానెల్లో ప్రోగ్రాంకి కూడా హాజరైనట్టు సమాచారం.

Also Read:చంద్రబాబుపై మరో కేసు.. బిగుస్తున్న ఉచ్చు?

- Advertisement -