బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విజయవంతంగా 16 రోజులు పూర్తి చేసుకుంది. తాజా ఎపిసోడ్లో భాగంగా మూడో పవరాస్త్ర కోసం అమర్ దీప్, శోభాశెట్టి, ప్రిన్స్ యావర్ ని ఎంపిక చేశారు బిగ్ బాస్. హౌస్ లో అందరూ కలిసి వినాయకచవితి సెలబ్రేట్ చేసుకున్నారు.
మూడో పవరాస్త్రలో తన పేరు లేకపోవడంతో ప్రశాంత్ … నేను ఓడిపోయా అంటూ తెగ బాధపడ్డాడు. దీంతో ప్రశాంత్ ని కన్ఫెషన్ రూమ్ కి పిలిచి పవరాస్త్ర కోసం నేను సెలెక్ట్ చేసిన ముగ్గురిలో అనర్హులు ఎవరో చెప్పమన్నాడు బిగ్బాస్. దీంతో ప్రశాంత్.. శోభాశెట్టి అనర్హురాలు అని చెప్పాడు. ఇక మిగిలిన వాళ్లలో ప్రియాంక.. అమర్ దీప్, శుభశ్రీ.. శోభాశెట్టి, తేజ.. యావర్, దామిని.. యావర్, గౌతమ్.. శోభాశెట్టి, రతిక.. యావర్ పేర్లను చెప్పారు. అనంతరం వీళ్ళు చెప్పిన మాటలని రికార్డ్ చేసి బిగ్బాస్ ఇంట్లో వాళ్లందరికీ ఆ వీడియోలు ప్లే చేసి చూపించడంతో అంతా షాక్ అయ్యారు.
Also Read:రాజమౌళే నాకు ఆదర్శంః రాము కోన
ఇక యావర్ కోపంతో అరుస్తూ.. బల్లని కొడుతూ నానా హంగామా చేశాడు. రతిక తనని వెన్నుపోటు పొడిచిందని బాధపడ్డాడు. ఈ క్రమంలో శివాజీ పవరాస్త్రని అమర్ దీప్ దొంగతనం చేశాడు. శివాజీ ఎవరు తీశారు అని కనుక్కునే ప్రాసెస్ లో రతిక.. ప్రశాంత్ తీసాడేమో అని అతనితో గొడవ పెట్టుకుంది. దీంతో ప్రశాంత్ – రతికల మధ్య వాగ్వాదం రచ్చకు దారితీసింది.
ఇక తర్వాత హౌస్లో తన పెళ్లి గురించి, రిలేషన్ షిప్ గురించి చెప్పేసింది శోభా. శుభశ్రీతో మాట్లాడుతూ నేను కమిటెడ్ అని చెప్పానా నీకు.. చెప్పలేదు కదా.. నేను ఎంగేజ్డ్.. ఇదే సీక్రెట్.. జనవరిలోనే నా పెళ్లి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హౌస్లో లవ్ట్రాక్లు నడుస్తున్న సంగతి తెలిసిందే. రతిక వెనకాల పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ తిరుగుతున్నారు. ఇక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి టేస్టీ తేజ.. శోభా చుట్టూనే తిరుగుతున్నాడు. దీంతో శోభా ఇచ్చిన షాక్తో తేజ ఎలా రియాక్ట్ అవుతాడో వేచిచూడాలి..
Also Read:నూడుల్స్ తింటున్నారా.. జాగ్రత్త !