తెలంగాణలో అధికారం మాదే అంటూ తెగ జబ్బలు చరిచిన కాషాయ పార్టీ గత కొన్నాళ్లుగా దిక్కుతోచని స్థితిలో ఉంది. పార్టీ ఫుల్ యాక్టివ్ గా ఉండాల్సిన టైమ్ లో అంతర్గత కుమ్ములాటలు పెరిగిపోవడంతో వాటిని చక్కదిద్దుకోవడంలోనే అధిష్టానం మల్లగుల్లలు పడుతోంది. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఎన్నికలు వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. దీంతో పార్టీలో అసంతృప్త నేతలను కాపాడుకోవడం పెద్ద టాస్క్ లా మారింది. గత కొన్నాళ్లుగా గ్రూప్ రాజకీయాలు ఆ పార్టీని తీవ్రంగా వెంటాడుతున్నాయి. ముఖ్యంగా ఈటెల రాజేందర్ కు కీలక బాద్యతలు అప్పగించిన తరువాత ఎంతో కాలంగా పార్టీని అంటిపెట్టుకొని ఉన్న వారికి అన్యాయం జరిగిందనే ఆవేదనలో కొంతమంది నేతలు ఉన్నారట. .
వరంత కూడా పార్టీని విడేందుకు సరైన టైమ్ కోసం వెయిట్ చేస్తున్నాట్లు టాక్.తాజాగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి ఇంట్లో పలువురు బీజేపీ నేతలు సమావేశమయ్యారు. వీరంతా ఎందుకు సమావేశమయ్యారనే దానిపై పార్టీ అగ్రనేతలకు ఎలాంటి స్పష్టత లేదట. అయితే సమావేశమైన వారంతా ఈటెల వ్యతిరేకులే అని సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల తరువాత ఈటెలకు ప్రదాన్యం ఇవ్వడంపై బీజేపీ అధిష్టానంతో చర్చించేందుకు సిద్దమౌతున్నట్లు టాక్.
గతంలో చేరికల కమిటీ చైర్మెన్ గా ఈటెలకు బాద్యతలు అప్పగించింది అధిష్టానం. అయితే ఆ పదవిపై ఈటెల అసంతృప్తి గా ఉండడంతో మళ్ళీ కీలక పదవి అప్పగిస్తూ ప్రచార కమిటీ చైర్మెన్ చేసింది. ఇలా ఈటెలను మాత్రమే స్పెషల్ గా ట్రీట్ చేస్తుండడంతో తామంతా పార్టీలో ఉంది ఏం లాభం అని చాలమంది నేతలు కారాలు మిరియాలు నిరుతున్నారట. అటు బండి సంజయ్ ని అధ్యక్ష పదవి నుంచి తప్పించిన తరువాత ఆయన వర్గం కూడా పార్టీలో వేరుగానే ఉంటున్నట్లు తెలుస్తోంది. ఇలా బీజేపీలో గ్రూపు రాజకీయాలకు ఈటెలనే కారణం అనేది ఆ పార్టీ నేతల్లోనే ఉన్న ఒక అభిప్రాయం. మరి ఈ గ్రూప్ రాజకీయాలను బీజేపీ ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.
Also Read:చిచ్చు పెట్టేందుకు మోడీ.. రెడీ?