టీమిండియా ప్రయోగాలు ఫలిస్తాయా?

35
- Advertisement -

ఆసియా కప్ సొంతం చేసుకున్న తరువాత భారత్ ఆసీస్ తో వన్డే సిరీస్ కు సిద్దమౌతోంది. ఈ నెల 22 నుంచి ఆస్ట్రేలియా జట్టుతో మూడు వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చే నెలలో వరల్డ్ కప్ ఉండడంతో ఈ మెగా టోర్నీకి ముందు జరిగే ఈ సిరీస్ ను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆసీస్ జట్టుతో జరిగే ఈ సిరీస్ లో జట్టు కూర్పుపై సెలక్టర్లు ఓ అంచనకు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆసీస్ తో తలపడే భారత జట్టులో భారీగా మార్లులు చేశారు సెలక్టర్లు. మూడు వన్డేలకు గాను రెండు వేర్వేరు జట్లను బరిలోకి దించి ప్రయోగానికి తెరతీశారు టీమిండియా సెలక్టర్లు. మొదటి రెండు వన్డేలకు కేల్ రాహుల్ ను కెప్టెన్ గా ఎంచుకోగా వైస్ కెప్టెన్ గా రవీంద్ర జడేజా కు అవకాశం ఇచ్చారు. అయితే మొదటి రెండు వన్డేలకు సీనియర్ ఆటగాళ్ళైన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హర్ధిక్ పాండ్య, కుల్దిప్ యాదవ్ వంటి ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చారు. అలాగే రుతురాజ్ గైక్వర్డ్, రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్ వంటి వారికి తిరిగి అవకాశం కల్పించారు. ఇక మూడో వన్డే తో మళ్ళీ సీనియర్ ఆటగాళ్లు తిరిగి జట్టులోకి రానున్నారు. మూడు వన్డేలో కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్య ను ఎంపిక చేశారు సెలక్టర్లు. ఇక జట్టు కూర్పు విషయానికొస్తే..

మొదటి రెండు వన్డేలకు .. కేల్ రాహుల్ ( కెప్టెన్ ) రవీంద్ర జడేజా ( వైస్ కెప్టెన్ ), రుతురాజ్ గైక్వర్డ్, శుబ్ మన్ గిల్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, ఇషన్ కిషన్, శర్ధూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, షమి, సిరాజ్, ప్రసిద్ద్ కృష్ణ.

మూడో వన్డే జట్టు.. రోహిత్ శర్మ ( కెప్టెన్ ), హార్దిక్ పాండ్య ( వైస్ కెప్టెన్ ), శుబ్ మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేల్ రాహుల్ ( కీపర్ ), ఇషన్ కిషన్, రవీంద్ర జడేజా, శార్థూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దిప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్, బుమ్రా, షమి, సిరాజ్,

మరి వరల్డ్ కప్ కు ముందు టీమిండియా ప్రయోగాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.

- Advertisement -