మహేష్ సినిమాలో కూడా అదే స్ట్రాటజీ?

34
- Advertisement -

సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘ గుంటూరు కారం ‘. ఎన్నో అవాంతరాల మద్య షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికీ కన్ఫమ్ చేసింది. ఎప్పుడో షూటింగ్ ప్రారంభం అయినప్పటికి ఈ మూవీ షూటింగ్ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. ఇక రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటుందని అభిమానులు సంతోషించే లోపే మూవీలో భారీగా మార్పులు చోటు చేసుకున్నాయి. మొదట పూజా హెగ్డే హీరోయిన్ గా ఉండగా.. ప్రస్తుతం ఆమె స్థానంలో శ్రీలీల వచ్చి చేరింది..

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ కూడా తప్పుకున్నాడనే వార్తలు వచ్చినప్పటికి చిత్రా యూనిట్ కన్ఫర్మ్ చేయలేదు. ఒకానొక టైమ్ లో త్రివిక్రమ్ ఈ మూవీని పట్టించుకోవడమే మానేశారని వార్తలు వచ్చాయి. ఇలా ఎన్నో అవాంతరాల మద్య మూవీ షూటింగ్ సాగుతోంది. ఇదిలా ఉంచితే గుంటూరు కారంలో కూడా త్రివిక్రమ్ తన మార్క్ చూపించనున్నాడట. త్రివిక్రమ్ తన సినిమాలన్నీటిలో ఫ్యామిలీ సెంటిమెంట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకుంటారు.

ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ తోనే ఆయన బ్లాక్ బాస్టర్ విజయాలను నమోదు చేశారు. అయితే మొదటి మహేష్ సినిమా కోసం ఎలాంటి ఫ్యామిలీ సెంటిమెంట్స్ లేకుండా పక్కా ఉరమాస్ స్టోరీతో రాబోతున్నామని నిర్మాత నాగ వంశీ గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. కానీ తన స్ట్రాంగ్ జోన్ అయిన ఫ్యామిలీ ఎమోషన్స్ ను మిస్ చేస్తే తన మార్క్ తప్పుతుందని భావించి అదే మాస్ స్టోరీలో ఫ్యామిలీ డ్రామాను అదనంగా చేర్చరట డైరెక్టర్ త్రివిక్రమ్. దీంతో గుంటూరు కారంలో కూడా ఫ్యామిలీ ఎమోషన్స్ హైలెట్ కానున్నాయని టాక్. మరి మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో గుంటూరు కారంపై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో చూడాలి.

Also Read:ఎమ్మెల్సీ కవిత పోరాటం.. సక్సెస్?

- Advertisement -