ఉత్కంఠకు తెరపడింది. ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడుతుందని ప్రకటించింది బీసీసీఐ. ఆదివారం జరిగిన స్పెషల్ జనరల్ మీటింగ్‌లో బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా 15మంది సభ్యులతో జట్టును సోమవారం ఖరారు చేసింది. వైస్ కెప్టెన్‌గా రహానేను ఎంపిక చేసిన బీసీసీఐ సెకండ్ కీపర్‌గా కేదార్ జాదవ్‌కు చోటు కల్పించింది. ఇక హర్భజన్ సింగ్, గౌతమ్ గంభీర్‌కు నిరాశ ఎదురైంది. వారికి జట్టులో చోటు దక్కలేదు.
జట్టు : కోహ్లి (కెప్టెన్),రహానే (వైస్ కెప్టెన్),ధోని, హార్థిక్ పాండే, అశ్విన్, మహ్మద్ షమి, యువరాజ్ సింగ్, మనీష్ పాండే, రవీంద్ర జడేజా, బుమ్రా, రోహిత్, శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, ఉమేశ్ యాదవ్
జూన్ 1 నుంచి ఇంగ్లండ్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభంకానుంది. టీమిండియా డిఫెండింగ్ చాంపియన్‌గా టైటిల్ వేట మొదలుపెట్టనుంది. భారత్ తన తొలి మ్యాచ్ జూన్ 4న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. 2013లో చివరిసారి జరిగిన చాంపియన్స్‌ట్రోఫీని ఇండియా గెలుచుకున్న విషయం తెలిసిందే.