8 ఏళ్ల వయసులోనే..అంటూ షాకిచ్చింది..!

255
- Advertisement -

తన అందం, అభినయంతో తెలుగు వారిని ఆకట్టుకుంది ఢిల్లీ ముద్దుగుమ్మ తాప్సీ. తెలుగులో అగ్రహీరోలతో కలిసి నటించిన ఈ అమ్మడుకి ఇంతవరకు సరైన హిట్ లేదు. ఒకే ఒక్క ‘Mr. పర్ ఫెక్ట్’ సినిమా తప్ప మిగిలిన సినిమాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద యావరేజ్ గా నిలిచాయి. ఇక తెలుగులో సరైన సక్సెస్‌ రాకపోవడంతో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు తమిళ్,బాలీవుడ్‌లోకి వెళ్లింది. బాలీవుడ్ లో సక్సెస్ కొట్టేసి యమ జోరు మీద ఉంది. కానీ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో
 thapsee in love అంత సక్సెస్ కాకున్నా.. బాలీవుడ్ లో మాత్రం అదుర్స్ అనిపిస్తోంది. తెలుగులో ఐరన్ లెగ్ అని పేరు తెచ్చుకుని.. ఇండస్ట్రీకి దూరమైనా.. హిందీ సినిమాల్లో మెరుస్తూ.. ఫ్యాన్స్‌ని అలరిస్తోంది తాప్సీ. ఇక ఇదిలాఉంటే.. ఈ అందాల రాశిని.. ఎప్పుడైనా ప్రేమలో పడ్డావా అని అడగ్గానే.. చటుక్కున ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చేసింది.
 thapsee in love
‘అవును. నేను ప్రేమలో పడ్డా. ఎప్పుడో పడ్డా. 8 ఏళ్ల వయసున్నుపుడే ప్రేమలో పడ్డా’ అంటూ షాకింగ్ రిప్లై ఇచ్చింది. ఆ తర్వాత.. తీరిగ్గా అసలు విషయం చెప్పేసింది. తను ప్రేమలో పడింది అబ్బాయితో కాదనీ.. ఆ వయసులో డ్యాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని, డ్యాన్స్ తోనే తాను ప్రేమలో పడ్డాననీ క్లారిటీ ఇచ్చింది. తాను అందరితోనూ ఒకేలా ప్రేమగా ఉంటానని.. అది ప్రొఫెషన్ కే పరిమితమని కూడా అనేసింది. అయితే పర్సనల్ గా మాత్రం  తనకు తనంటేనే ఇష్టమంటూ.. అసలు విషయం చెప్పి గలగలా నవ్వేసింది తాప్సీ.

- Advertisement -