గత కొన్నాళ్లుగా టీ కాంగ్రెస్ లో తీవ్ర కన్ఫ్యూజన్ నడుస్తోంది. సీట్ల పంపకల విషయంలోనూ ఆ పార్టీ సిఎం అభ్యర్థి ఎవరనే విషయంలోనూ నుంచి సస్పెన్స్ వీడడం లేదు. ఈ రెండిటిపైనే హైకమాండ్ కసరత్తులు చేస్తున్నప్పటికి ఓ కొలిక్కి రావడం లేదు. సీట్ల పంపకల విషయంలో అలకలు, అసమ్మతులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇక అటు సిఎం అభ్యర్థి ఎవరనే దానిపై మొదటి నుంచి కూడా ఎలాంటి క్లారిటీ లేదు. రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క.. ఇలా చెప్పుకుంటూ పోతే సిఎం అభ్యర్థి సీటు పై కన్నేసిన వారి లిస్ట్ పెద్దదే. వీరి నుంచి ఒక్కటినే అభ్యర్థిని ఎన్నుకోవడం హై కమాండ్ కు కత్తి మీద సాము లని వ్యవహారమే. .
ఎందుకంటే ఏ ఒక్కరినీ సిఎం అభ్యర్థిగా ప్రకటించిన ఇతరుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఏర్పడడం ఖాయం. ఎందుకంటే గతంలో పిసిసి చీఫ్ విషయంలోనూ ఇదే జరిగింది. రేవంత్ రెడ్డిని ప్రకటించిన తరువాత ఆ పార్టీలో చెలరేగిన అలజడి అంతా ఇంతా కాదు. అందుకే ఆ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సిఎం అభ్యర్థి విషయంలో అడుగులు వేస్తోంది అధిష్టానం. అయితే ఎన్నికల ముందు సిఎం అభ్యర్థిని ప్రకటిస్తే పార్టీలో చీలిక రావడం ఖాయం.
Also Read:ప్రజలకు డబ్బు పంచిన ఏకైక హీరో
అందుకే సరికొత్త వ్యూహరచన వైపు అధిష్టానం అడుగులు వేస్తోందట. ఎన్నికల తరువాత సిఎం అభ్యర్థిని ప్రకటిస్తే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా చేస్తోందట. అయితే ఎన్నికల్లో హస్తం పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయా అంటే ముమ్మాటికి లేవనే చెప్పాలి. మెజారిటీ నియోజిక వర్గాల్లో హస్తం పార్టీ బలహీనత గురించి ఆ పార్టీ నేతలకే బాగా తెలుసు. ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గెలుపు అనేది పగటి కలే. ఎన్నికల తరువాత సిఎం అభ్యర్థిని ప్రకటించాల్సిన అవసరం ఏముందనేది ? కొందరి అభిప్రాయం. ఒకవేళ ఎన్నికల ముందు సిఎం అభ్యర్థిని ప్రకటిస్తే సొంత నేతలే పార్టీని నట్టేట ముంచడం ఖాయం. దీంతో అధిష్టానం ఎటు తేల్చలేక ముక్కన వేలేసుకుంటుందట. మరి హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
Also Read:బండి సంజయ్‌కి ఓటమి ముప్పు?