బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ షో బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా రెండోవారం కొనసాగుతోంది. ఇక రెండోవారం ఎలిమనేషన్‌కు నామినేషన్లో 9 మంది ఉన్నారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఈ ఏడాది వరెస్ట్ రేటింగ్స్ సంపాదించింది. 7వ సీజన్‌లో అత్యధిక రేటింగ్స్‌ని సాధించింది.
బిగ్ బాస్ 6 రేటింగ్స్ అంతగా ఆకట్టుకోలేదు. అయితే ఈ సారి భారీ అంచనాలతో బిగ్ బాస్ 7ను తీసుకురాగా ఆ అంచనాలకు తగ్గట్టే ఏకంగా 18.1 టీవీఆర్‌తో బిగ్ బాస్ సీజన్ 7 లాంఛింగ్ ఎపిసోడ్ అదరగొట్టింది. తెలుగు బిగ్ బాస్ చరిత్రలో లాంఛింగ్ ఎపిసోడ్‌కి నాలుగో సీజన్ తరవాత అత్యధిక రేటింగ్ రావడం విశేషం.
7వ సీజన్ లాంఛింగ్ ఎపిసోడ్‌ని సుమారు 3 కోట్ల మంది ప్రేక్షకులు చూడడం విశేషం. దీంతో గతంలో క్రికెట్ మ్యాచ్‌లకు నమోదైన వ్యూయర్‌షిప్ రికార్డులను సైతం తెలుగులో బిగ్ బాస్ సీజన్ 7 అధిగమించింది. ఈ సీజన్ వ్యూయర్‌షిప్ 40 శాతం అధిక రేటింగ్‌తో దూసుకుపోతోందని స్టార్ మా వెల్లడించింది. బిగ్ బాస్ సీజన్ 7 వీకెండ్ ఎపిసోడ్‌కు సుమారు 7.1 రేటింగ్ రాగా హైదరాబాద్‌లో అత్యధికంగా 8.7 రేటింగ్ వచ్చింది.
Also Read:పవన్ పెద్ద ప్లానే.. అందుకే టీడీపీతో పొత్తు?