పవన్ పెద్ద ప్లానే.. అందుకే టీడీపీతో పొత్తు?

29
- Advertisement -

ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు విశ్లేషకులకు సైతం అంతు చిక్కడం లేదు. వైసీపీని గద్దె దించడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండబోతయని టీడీపీ, జనసేన మొదటి నుంచి చెబుతూ వస్తున్నాయి. అయితే పొత్తుపై పూర్తి స్పష్టత రాలేదు. ఇక స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో అసలు పొత్తు ఉంటుందా లేదా అనే సందేహాలు కూడా తెరపైకి వచ్చాయి. కానీ ఎవరు ఊహించని విధంగా టీడీపీతో పొత్తు ఉంటుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాజాగా స్పష్టం చేయడంతో ఒక్కసారిగా రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి..

ఎందుకంటే ఆల్రెడీ బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. నిన్న మొన్నటి వరకు టీడీపీతో పొత్తును కన్ఫర్మ్ చేయలేదు. ఒకానొక సందర్భంలో జనసేన బీజేపీ మాత్రమే పొత్తులో ఉంటాయని టీడీపీతో పొత్తు ఉండే అవకాశం లేదనే సంకేతాలు కూడా కనిపించాయి. ఇటీవల చంద్రబాబు అరెస్ట్ అయిన తరువాత బీజేపీ టీడీపీతో పూర్తిగా దూరం పాటిస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో పొత్తు రాజకీయాలు ఎలా టర్న్ తీసుకుంటాయో అనేది విశ్లేషకులకు సైతం అంటూ చిక్కలేదు. అయితే తాజాగా పవన్ టీడీపీతో పొత్తు కన్ఫర్మ్ చేయడంతో ఇందులో ఉన్న మతలబ్ ఏంటి అనే దానిపై పలు విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. పవన్ పక్కా వ్యూహాత్మకంగానే పొత్తు కన్ఫర్మ్ చేశారనేది కొందరి విశ్లేషకుల అభిప్రాయం. టీడీపీ అధినేత చంద్రబాబు జైలుపాలు కావడం ఎంతో కొంత పార్టీకి ప్రతికూలంగా మారుతుంది.

దానికి తోడు చంద్రబాబు ఎప్పుడు బయటకు వస్తారో కూడా చెప్పలేని పరిస్థితి మరోవైపు కేంద్రం జమిలి ఎన్నికలవైపు చూస్తోంది. ఈ నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వచ్చిన ఆశ్చర్యం లేదు. అందువల్ల నిన్న జైల్లో చంద్రబాబుతో భేటీ అయిన పవన్ ప్రస్తుత పరిస్థితులపై చర్చలు గట్టిగానే జరిపారట. ఈ చర్చల్లో భాగంగా టీడీపీ జనసేన ఉమ్మడి సి‌ఎం అభ్యర్థిగా పవన్ ఉండేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, అందుకే పవన్ టీడీపీతో పొత్తు ను కన్ఫర్మ్ చేశారని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటికే బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ ఆ పార్టీ కూడా కూటమిలో ఉంటుందా లేదా బీజేపీతో తెగతెంపులు చేసుకొని కేవలం టీడీపీతోనే పొత్తు కొనసాగిస్తారా అనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుతం టీడీపీతో పొత్తు విషయంలో బీజేపీ మౌనం వహిస్తోంది. మరి ఈ అంశంపై కూడా ముందు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి టీడీపీతో పొత్తును పవన్ కఫర్మ్ చేయడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.

Also Read:Harishrao:ప్రజలంతా సీఎం కేసీఆర్ వెంటే

- Advertisement -