Kavitha:జగిత్యాల నుండే బిఆర్ఎస్ జైత్రయాత్ర

31
- Advertisement -

జగిత్యాల నుంచి బిఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా ? అని ప్రశ్నించారు. జగిత్యాలలో బీఆర్ఎస్ సభలో మాట్లాడిన కవిత…కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పనులను సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కలలోనైనా ఊహించగలరా అని ప్రశ్నించారు. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పిన తర్వాతే తెలంగాణకు రావాలన్నారు.

డిక్లరేషన్ల పేరిట ఇస్తున్న హమీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ అవుట్ డేటెడ్ నాయకుడని…అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్ ను దేశమంతా తిరస్కరించిందన్నారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను నమ్మవద్దు అన్నారు. ప్రజలకు పీక్కదినడానికి కాంగ్రెస్ నాయకులు వస్తున్నారన్నారు.

మహిళా రిజర్వేషన్ బిల్లు మరియు దేశంలోని కీలక అంశాలపై మీ వైఖరి ఏమిటని గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూటిగా ప్రశ్నించారు. దేశంలోని ముఖ్యమైన అంశాలపై ఏ వైఖరి లేని ఏకైక పార్టీ కాంగ్రెస్సేనని విమర్శించారు. కీలకమైన అంశాలపై మౌనం వహించడం తగదని కాంగ్రెస్ పార్టీకి సూచించారు.

Also Read:బోల్డ్ రోల్స్ కూడా చేస్తా – మీనా

- Advertisement -