Harishrao:సతీష్ బాబును గెలిపించండి

43
- Advertisement -

తెలంగాణలో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. హుస్నాబాద్లో మాట్లాడిన ఆయన…ఎమ్మెల్యే ఎట్లా ఉండాలంటే సతీష్ బాబు లాగా ఉండాలే..నిజాయితీగల శాసనసభ్యుడు అని కొనియాడారు.ఆ రోజుల్లో గులాబీ జెండాకు ఉత్తర తెలంగాణలో అడ్డా అంటే మాకు కాపిటల్ లక్ష్మీకాంతరావు…కొన్ని వందలసార్లు ఉద్యమంలో అన్నం పెట్టి ఆతిథ్యం ఇచ్చినటువంటి గొప్ప ఇల్లు మా సతీష్ అన్నదన్నారు. తెలంగాణ కోసం గట్టిగా నిలబడేటువంటి మంచి మనసున్న కుటుంబం మా కెప్టెన్ కుటుంబం అని…రాష్ట్రంలో ఎవరినడిగినా మూడో సారి ఎవరు ముఖ్యమంత్రి అంటే కెసిఆర్ అనే సమాధానం వస్తుంది. హుస్నాబాద్ లో కూడా మూడోసారి సతీష్ కుమార్ ని గెలిపించుకుందాం అన్నారు.

హుస్నాబాద్ నియోజకవర్గంలో తండాలు గ్రామపంచాయతీలు అయినయ్ అంటే గౌరెల్లి ప్రాజెక్టు పూర్తవుతుందంటే ఇది కేవలం కేసీఆర్ గారి వలన సాధ్యమైందన్నారు. మిడ్ మానేర్ ద్వారా గోదావరి నీళ్లను హుస్నాబాద్ నియోజకవర్గానికి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది అన్నారు. గండి మహాసముద్రం ఏడాది లోపట నిర్మించి నిలిచినం..గౌరెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు సృష్టించారు అయినా సరే గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసింది BRS ప్రభుత్వం అన్నారు.

ఏడాదికి రెండు పంటలు పండుతున్నాయి అంటే అది కేసీఆర్ వల్లనే సాధ్యమైందన్నారు. కాంగ్రెస్ పార్టీది దొంగ డిక్లరేషన్. 50 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో 2000 పెన్షన్ ఇచ్చారా, కల్యాణ లక్ష్మి ఇచ్చారా, మిషన్ భగీరధ మంచినీళ్లు ఇచ్చారా ఆలోచించాలన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఓట్లు అడుగుతది..చీప్ ట్రిక్కులకు మాయమాటలకు ప్రజలు మోసపోవద్దు అన్నారు.తెలంగాణ సమాజం మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని సెల్ఫ్ డిక్లరేషన్ చేసుకుందన్నారు.

Also Read:క్యాబేజీతో ఆరోగ్య ప్రయోజనాలు..!

గులాబీ సైనికులుగా మనం ప్రతి ఇంటికి వెళ్లి వాస్తవాలను ప్రజలకు వివరించాలన్నారు. కాంగ్రెస్ పాలిత చత్తీస్ గడ్, కర్ణాటకలో తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలు ఉన్నాయా ఆలోచించాలన్నారు.
కాంగ్రెస్ అధికారంలో ఉన్న మూడు రాష్ట్రాల్లో తెలంగాణ సంక్షేమ పథకాలు అమలు చేసి తెలంగాణ ప్రజలను ఓట్లు అడగండన్నారు. కెసిఆర్ మేనిఫెస్టోలో చెప్పిన హామీలు, చెప్పని హామీలను కూడా నెరవేర్చారన్నారు. కరోనా వచ్చినా కేంద్ర ప్రభుత్వం తిప్పలు పెట్టినా కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేశారని….రాష్ట్రంలో బిజెపి బిచాణ ఎత్తేసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎలక్షన్లు అంటుందన్నారు. తెలంగాణలో జనాలని నమ్ముకున్న నాయకుడే నిలబడతాడు జమిలిని నమ్ముకున్న నాయకుడు కాదు అని ఎద్దేవా చేశారు.

ఇండియా పాకిస్తాన్ మధ్య కొట్లాట, హిందూ ముస్లింల కొట్లాట పెట్టి బిజెపి గెలవాలనుకుంటుందని…రైతు నల్ల చట్టాలు తెచ్చింది బీజేపీ. నల్లాలు ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలా నల్ల చట్టాలు తెచ్చిన బిజెపి కావాల్నా…రైతుబంధు కింద 72,000 కోట్లు రైతుల ఎకౌంట్లో వేసాం..60 వేల కోట్లతో రైతులకు ఉచిత కరెంటు ఇచ్చామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు లక్ష్మీకాంతరావు,రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, స్థానిక శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్, జెడ్పి చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Also Read:కుర్ర దర్శకుడి పై తప్పుడు వార్తలు

- Advertisement -