- Advertisement -
సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పం తోనే టీటీడీ వరుణ యాగం నిర్వహించినట్లు చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి చెప్పారు.శ్రీనివాసమంగాపురం ఆలయంలో అష్టోత్తర శత కుండాత్మక మహా శాంతి వరుణ యాగం ముగింపు సందర్బంగా సోమవారం ఈవో శ్రీ ఎవి ధర్మారెడ్డి తో కలసి గోపూజ చేశారు . అనంతరం మహా పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా శ్రీ కరుణాకర రెడ్డి మీడియాతో మాట్లాడారు. వరుణుడిని ప్రసన్నం చేసుకునేందుకు మూడు రోజులపాటు ఈ యాగం నిర్వహించినట్లు తెలిపారు.మూడు రాష్ట్రాలకు చెందిన 210 మందిరుత్వికలు వైఖానస ఆగమ శాస్త్రం ప్రకారం యాగం నిర్వహించారని ఆయన తెలిపారు.
Also Read:‘మంత్ ఆఫ్ మధు’లో నిజాన్ని నిజాయితీగా చెప్పాం
- Advertisement -