అఖిల్ మొదటి సినిమాలో హీరోయిన్‌గా ‘సాయేషా సైగల్’ తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తాజాగా మళ్ళీ అఖిల్ రెండో సినిమాలో కూడా తననే తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. సయేషా సైగల్ .. అఖిల్ సినిమాతో అక్కినేని హీరోయిన్‌గా పాపులరైంది. తొలి సినిమాతోనే ప్రతిభావంతురాలిగా ముద్ర వేసింది. కానీ ఇక్కడ సక్సెస్ కీలకం.
అది లేనిదే ప్రతిభ ఎంత ఉన్నా అనవసరం. సరిగ్గా ఇదే ఈ అమ్మడి అవకాశాల్ని టాలీవుడ్‌లో దారుణంగా దెబ్బ కొట్టింది. సయేషా సైగల్ ఉత్తరాదిన పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చింది. బాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్ సైరాభాను ఫ్యామిలీ నుంచి వచ్చిన అందాల బుట్టబొమ్మ. అందం ఉంది, అభినయం ఉంది, డ్యాన్సుల్లోనూ భేష్ . ఇన్ని అర్హతలు ఉండీ తొలి సినిమా పరాజయంతో తెలుగులో మళ్లీ అవకాశం అందుకోలేకపోయింది.
అయితే వాస్తవానికి అఖిల్ నటిస్తున్న రెండో సినిమాకి కూడా సయేషా పేరునే తొలుత పరిగణనలోకి తీసుకున్నారట. కానీ సెంటిమెంట్ ప్రకారం సయేషా అయితే బావుండదని ఆ తర్వాత ఆలోచించారట. అఖిల్ – విక్రమ్.కె సినిమా కథ ఉత్తరాదిన కూడా తిరుగుతుంది కాబట్టి సయేషా సరిపోతుంది.
కానీ దురదృష్టం మళ్లీ ఫ్లాప్ జోడీ అన్న ముద్ర పడకుండా.. ఇప్పుడు జాగ్రత్తలు తీసుకోవడంతో సయేషా పేరు బ్యాక్ బెంచ్‌కి వెళ్లిపోయింది. ఆ స్థానంలో నవతరంలో జోరుమీదున్న ఆలియాభట్ అయితే బావుంటుందన్న ప్రతిపాదనలు వచ్చాయట. ప్రస్తుతం ఆలియా కోసం అఖిల్ సీరియస్‌గానే ట్రై చేస్తున్నాడు. ఏది ఏమైనా సయేషా లాంటి ట్యాలెంటెడ్ గాళ్ తొలి సినిమా పరాజయంతో భారీ మూల్యమే చెల్లించుకోవాల్సొచ్చింది.