KTR:పాలమూరు గోస తీర్చే ప్రాజెక్టు ఇది

33
- Advertisement -

16వ తేదీన జరిగే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవం తెలంగాణ చరిత్రలో ఒక మైలురాయిగా నిలిచిపోతుందన్నారు మంత్రి కేటీఆర్. ఈనెల 16న జరిగే పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ప్రారంభోత్సవ కార్యక్రమ ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్,సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌తో పాటు వివిధ శాఖల అధిపతులు, కలెక్టర్లు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్..వలసల జిల్లాలో ఒకనాడు పడావుపడ్డ పాలమూరు జిల్లాను పచ్చగా చేస్తుంది ఈ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు అన్నారు. ప్రతి ఏటా లక్షలమంది పాలమూరు ప్రజలు వలస పోయే పరిస్థితి ఉండేది . కానీ నేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే స్థాయి ప్రాజెక్టు ప్రారంభోత్సవం చేసుకుంటున్నాం అన్నారు. పాలమూరుతో పాటు రంగారెడ్డి జిల్లా భూములకు సైతం నీళ్లు అందిస్తుందన్నారు.

గోదావరిలో కాలేశ్వరం, కృష్ణాలో పాలమూరు-రంగారెడ్డి లాంటి గొప్ప ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం కట్టింది. సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి అయితే తెలంగాణ సాగునీటి రంగంలో ప్రాజెక్టులు సంతృప్త స్థాయిలో పూర్తి అవుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం కెసిఆర్ నాయకత్వంలో కట్టిన ప్రాజెక్టులను చూసి కేవలం తెలంగాణ బిడ్డగానే కాకుండా భారత దేశ పౌరుడిగా కూడా గర్వంగా ఉంటుందన్నారు. ఈ ప్రాజెక్టుల నిర్మాణం వెనక 2001 నుంచి కన్న తెలంగాణ ప్రజల కల ఇది. ఉద్యమ కాలం నుంచి కెసిఆర్ గారి ఆలోచనల మేరకు రూపుదిద్దుకున్న గొప్ప ప్రాజెక్టు అన్నారు.

Also Read:జాగింగ్ తో.. ఎన్ని ప్రయోజనాలో..!

రైతుల పొలాలకు సాగునీటితో పాటు, రాజధాని ప్రజల తాగునీటి అవసరాలు, పరిశ్రమలకు అవసరమైన నీటి సరఫరాను కూడా ఈ ప్రాజెక్టు అందిస్తుందన్నారు. ఇంత గొప్ప సందర్భాన్ని గొప్పగా నిర్వహించాల్సిన అవసరం ఉందని…ఈ ప్రాజెక్టు యొక్క విశిష్టతను ప్రజలకు తెలియజేసేలా గొప్పగా సంబరాలు చేసుకోవాలన్నారు. కనీసం లక్షన్నర మంది రైతులతో ప్రారంభోత్సవం సభ ఉంటుందని…ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లపైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు ఇతర విభాగాల అధిపతులతో కూలంకషంగా చర్చించారు మంత్రులు.

Also Read:ఎన్టీఆర్..మరో మూవీ రీ రిలీజ్!

- Advertisement -