మొరాకోలో భారీ భూకంపం..300 మంది మృతి

17
- Advertisement -

మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. శుక్రవారం రాత్రి మొరాకోలోని హై అట్లాస్ పర్వతాలపై 6.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా 300 మంది మృతిచెందారు. పెద్ద పెద్ద భవనాలు భూకంప తీవ్రతకు నేలమట్టమయ్యాయి. ధ్వంసమైన భవనాల శిథిలాల కింద వందలాది మంది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా సహాయక కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

భూకంప కేంద్రం సాపేక్షంగా 18.5 కి.మీ లోతులో ఉందని, మర్రకేష్‌కు నైరుతి దిశలో 72 కి.మీ (44 మైళ్లు), ఔకైమెడెన్ పట్టణానికి పశ్చిమాన 56 కి.మీ (సుమారు 35 మైళ్లు) సంభవించిందని అధికారులు తెలిపారు.

మొరాకో భూకంప ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ విచారం వ్యక్తం చేశారు. ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబసభ్యులకు సంతాపం తెలిపారు. గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Also Read:చంద్రబాబు అరెస్ట్ వెనుక.. భారీ వ్యూహమా ?

- Advertisement -