కృష్ణ వంశీ తెరకెక్కిస్తున్న నక్షత్రం మూవీపై రకరకాల న్యూస్ వస్తున్నాయి. ప్రాజెక్ట్ గురించి అప్ డేట్స్ కూడా ఆగిపోవడంతో ఇక మూవీని పక్కన పెట్టేశారని.. రిలీజ్ ఆగిపోయినట్లేనని ఈ మధ్య ఓ టాక్ నడించింది.కృష్ణవంశీ తెరకెక్కిస్తోన్న ‘నక్షత్రం’ చిత్రం ఆర్థిక ఇబ్బందుల్లో పడిందని, ఫైనాన్స్ లేక షూటింగ్ నిలిచిపోయిందని మీడియాలో వార్తలు వచ్చాయి. కానీ మే లో సినిమా థియేటర్లలోకి వస్తుందంటూ నిర్మాతలు కన్ఫామ్ చేశారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదలైంది..
కృష్ణవంశీ తనదైన శైలిలో ‘నక్షత్రం’ తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. ‘ప్రతీ పోలీస్ యూనిఫాంలో ఉన్న ఓ పౌరుడు. ప్రతీ పౌరుడు యూనిఫాం లేని ఓ పోలీస్ అధికారి’ అని టీజర్లో చూపించారు. ‘ఉద్యోగం లేకపోయినా యూనిఫాం వేసుకుని దేశానికి సేవ చేయాలనుకున్నా. తప్పా! సర్’ అంటూ సందీప్ కిషన్ చెప్పిన డైలాగ్ ఆకట్టుకుంటోంది. మరి ఇందులో ఎవరు పోలీస్..? ఎవరు పౌరుడు? తెలియాలంటే సినిమా విడుదలయ్యే వరకూ ఆగాల్సిందే. సందీప్‌కిషన్, సాయిధరమ్‌తేజ్, తనీష్, రెజీనా, ప్రగ్యాజైశ్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. బుట్టబొమ్మ క్రియేషన్స్ పతాకంపై కె.శ్రీనివాసులు, ఎస్.వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.