హీరో నిఖిల్ సిద్ధార్థ సినిమాల కోసం తన బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కంఫర్ట్ జోన్ లో కాకుండా ఛాలెంజింగ్ పాత్రలను పోషించడానికి ఇష్టపడతారు. నిఖిల్ తన నెక్స్ట్ పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభూ‘ కోసం కఠినమైన శిక్షణను పొందబోతున్నారు.
యుద్ధం నేపధ్యంలో వుండే చిత్రాల కోసం ఒక నటుడు పూర్తి ప్రొఫెషనల్‌గా ఉండాలి. అన్నిరకాల పోరాట నైపుణ్యాన్ని నేర్చుకోవాలి. ‘స్వయంభూ’ లో ఒక యోధునిగా కనిపించడానికి నిఖిల్ ఒక నెల రోజుల పాటు కఠినమైన శిక్షణ కోసం వియత్నాం వెళ్లారు. ఆయుధాలు, మార్షల్ ఆర్ట్స్, గుర్రపు స్వారీలో శిక్షణ తీసుకుంటున్నారు నిఖిల్. సైగాన్‌లోని కొంతమంది బిగ్గెస్ట్ స్టంట్ మాస్టర్‌లు, టీమ్స్.. యూనిట్లో భాగంగా వుండి, స్వయంభూ యాక్షన్ సీక్వెన్స్‌ల కోసం నిఖిల్ కి శిక్షణ ఇస్తారు.
అలాగే నిఖిల్ ఫిజికల్ మేకోవర్ కూడా అవుతున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ లో ఒక లెజెండరీ యోధుడిగా కనిపించారు. ఇప్పటి వరకు నిఖిల్‌కి ఇది చాలా ఛాలెంజింగ్ రోల్.
Also Read:బాలయ్య సీరియస్.. పాపం బాబీ
భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్‌కు ఇది మైల్ స్టోన్ 20 వ చిత్రం మరియు తన కెరీర్ లో మోస్ట్ ఎక్స్ పెన్సివ్ మూవీ. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ పతాకంపై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
‘స్వయంభూ’ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో రూపొందిస్తున్నారు. రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తుండగా, మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎం ప్రభాహరన్ ప్రొడక్షన్ డిజైనర్ గా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి వాసుదేవ్ మునెప్పగారి డైలాగ్స్ అందిస్తున్నారు.