‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ పరిస్థితేంటి ?

49
- Advertisement -

‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ 100% ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు’ అంటూ మెగాస్టార్ చిరంజీవి నిన్న ఈ సినిమా గురించి సాలిడ్ ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. మరి నేడు ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ప్రేక్షకుల ముందు వచ్చింది. న‌వీన్ పోలిశెట్టి, అనుష్కశెట్టి ప్ర‌ధాన పాత్ర‌ల్లో వచ్చిన ఈ సినిమా పరిస్థితి ఏమిటి ?, అసలు ఈ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ?, చూద్దాం రండి. పెళ్లి చేసుకోకుండానే సరోగసీతో పిల్లల్ని కనాలని హీరోయిన్ అనుష్క అనుకోగా, దాన్ని హీరో నవీన్ పోలిశెట్టి ఎలా అర్థం చేసుకున్నారు ?, ఆ తర్వాత ఏం జరిగింది అనేది కథ.

కథ సింపుల్ గా ఉన్నప్పటికీ.. సినిమా కథలో మాత్రం కామెడీ, పాటలు, ఎమోషన్స్ చాలా చక్కగా కుదిరాయి. అనుష్క, నవీన్ నటన సినిమాకు హైలెట్ గా నిలిచింది. అసలు కథ, కామెడీ, ఎమోషన్స్ ఇంటర్వెల్ తర్వాతే ఉన్నాయి. దాంతో సెకండ్ హాఫ్ ఈ సినిమాకి ప్రాణంగా మారింది. ఇప్పటికే ఈ మూవీ చూసిన పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో సినిమాపై పోస్టులు పెడుతున్నారు. సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి అంటున్నారు. కొందరు ప్రేక్షకులు అయితే, ఈ సినిమా సూపర్ హిట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

స్వీటి, నవీన్ అభిమానులకు ఈ మూవీ నచ్చుతుందని మరికొందరు ట్వీట్లు పెడుతున్నారు. మొత్తానికి ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ రివ్యూ అందర్నీ ఆకట్టుకుంది. మరి ఈ సినిమా బాక్సాఫీస్ పరిస్థితి ఏమిటి ?, అసలు ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ సినిమాకి ఓపెనింగ్స్ వచ్చాయా ? లేదా ?. ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ :1.83 కోట్ల షేర్ కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 3.63 కోట్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి.. ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ హిట్ అయినట్టే.

Also Read:ప్రోటీన్ల కోసం ఇవి తినండి…

- Advertisement -