ఇష్టం సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ శ్రియ. తొలిసినిమాతోనే ప్రేక్షకులను మెప్పించిన శ్రియ…అనతికాలంలోనే అగ్రహీరోలతో నటించే అవకాశాన్ని కొట్టేసింది. తర్వాత కొన్నేళ్ల పాటు తెలుగు ఇండస్ట్రీని ఊపేసింది. 20 ఏళ్లుగా తన ఫిజిక్ కాపాడుకుంటూ ఔరా అనిపిస్తుంది. ఈ మధ్యే తన ప్రియుడు ఆండ్రీ కోస్చీవ్‌ను పెళ్లి చేసుకుని బిడ్డకు తల్లై తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తోంది.
బిడ్డకు తల్లైనా తన ఫిజిక్‌ని మాత్రం అలాగే కాపాడుకుంటూ వస్తోంది. ఇక పెళ్లికి ముందు గ్లామర్ షోతో ఆకట్టుకున్న శ్రియా తర్వాత చీరకట్టులో అందాల ప్రదర్శనతో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ వస్తోంది. తాజాగా మరోసారి చీరకట్టులో మరోసారి రెచ్చిపోయింది శ్రియా. ఆమె ఫోటోలు చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
గతేడాది రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ చిత్రంలో రామ్ చరణ్ తల్లి పాత్రలో మెరిసింది. ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ భార్య పాత్రలో నటించి మెప్పించింది.
Also Read:ఉదయనిధి స్టాలిన్‌పై కేసు..