అణచివేతకు వ్యతిరేకంగా ‘పెదకాపు-1’

11
- Advertisement -

సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ప్రస్తుతం న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ పెదకాపు-1ని రూపొందిస్తున్నారు. ‘అఖండ’ లాంటి మాసీవ్ బ్లాక్ బస్టర్ ని అందించిన ద్వారకా క్రియేషన్స్‌పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో విరాట్ కర్ణ హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రగతి శ్రీవాస్తవ హీరోయిన్.

పెదకాపు-1ని సెప్టెంబర్ 29న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ఈరోజు అనౌన్స్ చేశారు. దసరా పండుగ సందర్భంగా భారీ పోటీ వుండటంతో ఇది పర్ఫెక్ట్ డేట్. ఇంతకుముందు విడుదల చేసిన టీజర్, పాటలకు అద్బుతమైన రెస్పాన్స్ వచ్చింది. రానున్న రోజుల్లో ప్రమోషన్స్ మరింత ముమ్మరం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

పెదకాపు-1 అణచివేత, ఘర్షణల నేపథ్యంలో రూపొందిన చిత్రం. టీజర్‌లో హీరో క్యారెక్టర్ ఆర్క్ ఒక సామాన్యుడి నుండి ఇద్దరు శక్తివంతమైన వ్యక్తులకు వ్యతిరేకంగా అతను చేసే పోరాటం వరకు అద్భుతంగా ప్రజంట్ చేశారు. ఈ చిత్రానికి ఛోటా కె నాయుడు సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం సమకూరుస్తున్నారు.

Also Read:Asiacup 2023:సూపర్ 4లోకి టిమిండియా ఎంట్రీ!

- Advertisement -