Asiacup 2023:సూపర్ 4లోకి టిమిండియా ఎంట్రీ!

23
- Advertisement -

ఆసియాకప్ లో భాగంగా నిన్న నేపాల్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన నేపాల్ 48 ఓవర్లలో 230 పరుగులు చేసి ఆలౌట్ గా నిలిచింది. ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన టీమిండియా 20 ఓవర్లలో 147 పరుగులు చేసింది. ఆ తరువాత వర్షం కారణంగా మ్యాచ్ రద్దు కావడంతో డక్ వర్త్ లూయిస్ ప్రకారం టీమిండియా ను విజేతగా ప్రకటించారు. ఇక పాక్ తో జరిగిన మ్యాచ్ లో నిరాశపరిచిన ఓపెనర్స్ రోహిత్ శర్మా, శుబ్ మన్ గిల్ ఈ మ్యాచ్ లో రాణించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 59 బంతుల్లో 74 పరుగులు చేశాడు, అటు శుబ్ మన్ గిల్ కూడా 62 బంతుల్లో 67 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్ విజయంతో భారత్ సూపర్ 4 లోకి అడుగు పెట్టింది. ఇక ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి పాకిస్తాన్ సూపర్ లో మొదట అడుగు పెట్టింది. అటువైపు గ్రూప్ బి రెండు మ్యాచ్ లు ఆది ఒక విజయం సాధించిన బంగ్లాదేశ్ సూపర్ 4 అడుగు పెట్టింది. ఇక మరో బెర్త్ కోసం శ్రీలంక అఫ్గానిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఈ రెండు జట్లలో గెలిచిన శ్రీలంక గెలిస్తే గ్రూప్ ఏ లోని టీమిండియా తో సూపర్ 4 లో తలపడనుంది. ఒకవేళ అఫ్గానిస్తాన్ గెలిస్తే..నెట్ రేట్ కారణంగా శ్రీలంక కె సూపర్ 4 వెళ్లడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. కానీ నెట్ రన్ రేట్ కారణంగా సూపర్ 4 లో తలపడే జట్ల ఆర్డర్ మారే అవకాశం ఉంది. అప్పుడు మళ్ళీ పాకిస్తాన్ తో టీమిండియా తలపడే ఛాన్స్ లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Also Read:Vijay Devarakonda:నా పై కుట్ర జరుగుతోంది

- Advertisement -