అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న బిగ్ బాస్ 7 తెలుగు విజయవంతంగా స్టార్ట్ అయింది. ఆదివారం సీజన్ గ్రాండ్‌గా ప్రారంభంకాగా ఈ సారి కింగ్ నాగార్జునే హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.
సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 9.30 గంటలకు స్టార్ మాలో ప్రసారం కానుండగా డిస్నిప్లస్ హాట్ స్టార్ లో 24 గంటలు లైవ్ తో స్ట్రీమ్ కానుంది.
ఈసారి కంటెస్టెంట్స్ వీరే..
తొలి కంటెస్టెంట్‌గా వచ్చింది సిరీయల్ నటి..ప్రియాంక జైన్. రెండో కంటెస్టెంట్‌గా టాలీవుడ్ హీరో శివాజీ, తర్వాత సింగర్ దామినిని హౌస్‌లోకి పంపించారు నాగ్. మోడలింగ్ రంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ప్రిన్స్ యావర్, నటి, లాయర్ శుభశ్రీ, బోల్డ్ క్యారెక్టర్స్‌తో టాలీవుడ్‌ని షేక్ చేసిన షకీలా, ఆట సందీప్,బుల్లితెర ఫేమస్ విలన్ శోభాశెట్టి, యూట్యూబ్ ఫుడ్ వ్లాగర్ టేస్టీ తేజ ఈసారి హౌస్‌లోకి వెళ్లారు.
అలాగే తెలుగమ్మాయి రతిక రోజ్, నటుడు,ఆకాశవీధుల్లో మూవీ హీరో గౌతమ్,కిరణ్ రాథోడ్, యూట్యూబర్ యువరైతు పల్లవి ప్రశాంత్ ,సీరియల్ యాక్టర్ అమర్ దీప్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. మొత్తం 14 మందితో ఈ సారి షో ప్రారంభించారు. ముందు ముందు ఎవరు వెళ్తారనేది సస్పెన్స్‌గా ఉంచారు. చివరగా హీరో నవీన్ పోలిశెట్టిని హౌస్‌లోకి పంపించారు.
Also Read:MLC Kavitha:గులాబీ జెండా ఎగరాలి