MLC Kavitha:గులాబీ జెండా ఎగరాలి

41
- Advertisement -

సింగరేణి ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలన్నారు ఎమ్మెల్సీ కవిత. సింగరేణి సంస్థకు చెందిన పాఠశాలల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న టీచింగ్‌, నాన్ టీచింగ్ సిబ్బంది తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆదివారం హైదరాబాదులో ఎమ్మెల్సీ కవితను కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన కవిత..తెలంగాణ రాకముందు వారసత్వ ఉద్యోగాల అంశం తీవ్రమైన సమస్యగా ఉండేదని, అప్పట్లో కేవలం 4000 ఉద్యోగాలు మాత్రమే ఇస్తే తెలంగాణ ఏర్పడిన తర్వాత 20 వేల ఉద్యోగాలు కల్పించాలని స్పష్టం చేశారు.ఆర్టీసీ సంస్థను కూడా ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వంలో విలీనం చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని తేల్చి చెప్పాలన్నారు.

సింగరేణిని ప్రైవేటీకరించే పరిస్థితి నుంచి సీఎం కేసీఆర్ తప్పించారని…ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించి ఆ సంస్థను కాపాడారని వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ వస్తున్నారని అన్నారు.

Also Read:అల్లం ‘టీ’తో ప్రయోజనాలు..

- Advertisement -