కొన్ని వార్తలు వినడానికి కూడా విచిత్రంగా ఉంటాయి. అలాంటి వార్తే ఒక్కటి ఇప్పుడు వైరల్ గా మారింది. విజయ్ దేవరకొండపై నాగచైతన్య రివేంజ్ అంటూ ఆ వార్త సారాంశం. అదేంటి ?, విజయ్ దేవరకొండకి – నాగచైతన్యకి మధ్య ఏం జరిగింది ?, ఏం జరగలేదు..వారిద్దరి మధ్య సమంత వ్యవహారం చేరింది. విజయ్, సమంత జంటగా ఖుషి సినిమా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, సమంత మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉన్నాయి. అవి ఏ రేంజ్ లో పేలాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముక్యంగా ఓ షాట్ లో లిప్ లాక్ కూడా ఉంటుంది. అలాగే, ఓ బెడ్ సీన్ కూడా ఉందట. కాకపోతే ఆ సీన్ ను తీసేశారు.
ఆ సీన్స్ అన్ని చైతు దగ్గరకు వెళ్లాయి అని, ఈ విషయంలో చైతు బాగా ఫీల్ అయ్యాడు అని తెలుస్తోంది. సమంత మాట వినదు. కనీసం విజయ్ దేవరకొండ అయినా, తమ ఫ్యామిలీ పరువును దృష్టిలో పెట్టుకుని ఆమెతో రొమాన్స్ చేయకుండా ఉండి ఉంటే బాగుండేది అని చైతు ఫీల్ అయ్యాడట. దీంతో నాగచైతన్య, విజయ్‌పై ఎలాగైనా రివేంజ్ తీర్చుకోవాలని ప్లాన్ చేశాడంటూ ఫిలింనగర్లో ఓ రూమర్ వినిపిస్తోంది. చైతన్య నెక్స్ట్ మూవీలో హీరోయిన్గా రష్మిక మందన్నను తీసుకోవాలని పట్టుబడుతున్నాడట. రష్మికతో విజయ్ దేవరకొండ రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే.
అందుకే, రష్మిక మందన్నాతో తాను రొమాన్స్ చేసి విజయ్ దేవరకొండను బాధ పెట్టాలని చైతు భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే డైరెక్టర్‌తోనూ రష్మికతో తనకు ఘాటు రొమాన్స్ ఉండాలని చైతూ చెప్పాడట. ఇక ఖుషి మూవీ కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఈ సినిమా మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.30.01 గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వారం ఎలాంటి పెద్ద సినిమాలు లేకపోవడంతో కచ్చితంగా ఖుషి రూ.100 కోట్ల గ్రాస్ సాధిస్తుందని చిత్రయూనిట్ అభిప్రాయపడుతోంది. ఇక ఈ సినిమాకు రూ. 53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
Also Read:ఆదిత్య ఎల్1 ప్రయోగంపై సీఎం కేసీఆర్ హర్షం