ఎన్టీఆర్ చాలా నేర్చుకోవాలి!

43
- Advertisement -

నట సార్వభౌముడు ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రూ. 100 నాణేన్ని ముద్రించింది. దీన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఇవాళ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా పాల్గొన్నారు. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ తప్ప. అయితే జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడానికి ముఖ్య కారణం ‘దేవర’ సినిమా అని చెబుతున్నారు. తారక్ ‘దేవర’ మూవీ షూటింగ్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ కార్యక్రమానికి వెళ్ళలేకపోయాడట. తన తాతయ్య శత జయంతికి కూడా జూ.ఎన్టీఆర్ దూరంగా ఉన్నాడు. దీంతో తెలుగు తమ్ముళ్లు మళ్లీ ఎన్టీఆర్ పై విరుచుకు పడుతున్నారు.

తాతయ్య కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ కి తన సినిమా షూటింగ్ ఎక్కువా ? అంటూ బూతులు తిడుతున్నారు. అసలు సీనియర్ ఎన్టీఆర్ పేరు లేకపోతే.. జూనియర్ ఎన్టీఆర్ కి ఈ స్థాయి వచ్చేదా ?, గొప్ప నటులు ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు. కానీ జూ. ఎన్టీఆర్ కి గుర్తింపు వచ్చింది అంటే.. అది కేవలం సీనియర్ ఎన్టీఆర్ వల్లే అంటూ తెలుగు తమ్ముళ్లు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ పై మాటల దాడి చేయడం తారక్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదు. టీడీపీలోని ఎన్టీఆర్ డై హార్డ్ ఫ్యాన్స్ తో పాటు పార్టీలకు అతీతంగా అభిమానించే వారు… ఈ కామెంట్స్ ను ఖండిస్తున్నారు.

సోషల్ మీడియా వేదికగా ఎన్టీఆర్ పై నెగిటివ్ కామెంట్స్ కి చాలా ఘాటుగానే కౌంటర్లు ఇస్తున్నారు. అసలు ఇంత దూరం తెచ్చుకోవడం అవసరమా ?, ఎన్టీఆర్ కి పబ్లిసిటీ పిచ్చి కూడా పూర్తిగా పోయినట్టు ఉంది. బిల్డప్ లోకంలో సైలెంట్ గా ఉంటే.. ఎవరూ పట్టించుకోరు అనే విషయాన్ని తారక్ అర్ధం చేసుకుంటే మంచిది. ఈ విషయంలో అల్లు అర్జున్ ను, పవన్ కళ్యాణ్ ను, అలాగే రామ్ చరణ్ ను చూసి ఎన్టీఆర్ చాలా నేర్చుకోవాలి. ప్రస్తుతానికి అయితే టీడీపీ లోని ఎన్టీఆర్ ఫ్యాన్స్, యాంటీ ఫ్యాన్స్ అన్నట్లు మారింది. నిజానికి ఈ వార్ చాలా ఏళ్లగా నడుస్తూనే ఉంది. ఒకటి మాత్రం ఎన్టీఆర్ సరిచేసుకోవాలి. అదే పబ్లిసిటీ.

Also Read:బాబోయ్.. కుర్ర హీరోతో రొమాన్స్

- Advertisement -