కాంగ్రెస్ ” కాపీ క్యాట్ “?

51
- Advertisement -

రాజకీయాల్లో గెలిచిన పార్టీ విధానాలను హామీలను ఇతర పార్టీలు ఫాలో అవుతుండడం సర్వ సాధారణం. అయితే కాపీ వెర్షన్స్ ఎన్ని వచ్చిన ఒరిజినల్ కు ఉండే ఇంపాక్ట్ ఎప్పటికీ అలాగే ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణలో అధికార బి‌ఆర్‌ఎస్ ను కాపీ కొట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రజా శ్రేయస్సు కొరకు ముఖ్యమంత్రి కే‌సి‌ఆర్ అమలు చేస్తున్న పథకాలను వారి హామీలుగా ప్రకటిస్తూ రాజకీయ పబ్బం గడిపేందుకు ఇతర పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ ఇటీవల ప్రకటించిన హామీలను చూస్తే హస్తంపార్టీ బి‌ఆర్‌ఎస్ ను ఎంతలా ఫాలో అవుతుందో అర్థం చేసుకోవచ్చు. రైతు బంధు పథకం కింద ఎకరానికి పది వేల రూపాయలు ఇస్తూ పేద రైతులను ఆదుకుంటోంది కే‌సి‌ఆర్ సర్కార్.

అయితే తాము అధికారంలోకి వస్తే అదే రైతు బంధు పథకం కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక ఎస్సీల పురగతికి బి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత బందు పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసారి ఎనికల్లో గెలిస్తే దళిత బంధు పథకం ద్వారా ఎస్సీలకు పది లక్షలు అందిస్తామని కే‌సి‌ఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ ఈ పథకాన్ని కూడా కాపీ కొడుతూ 12 లక్షలు ఇస్తామని చెబుతోంది. ఇలా కే‌సి‌ఆర్ అమలు చేస్తున్న మెజారిటీ పథకాలను తిరిగి హామీలుగా ప్రకటిస్తూ ప్రజల దృష్టిని ఆకర్షించాలని హస్తం నేతలు భావిస్తున్నారు. అయితే ఈ పథకాలకు ఆద్యం పోసింది సి‌ఎం కే‌సి‌ఆర్ అనే సంగతి ప్రజలకు తెలియనిది కాదు. అందువల్ల కాంగ్రెస్ ఎన్ని వ్యూహాలు పన్నినా ప్రజల్లో బి‌ఆర్‌ఎస్ స్థానాన్ని మార్చలేరన్నది రాజకీయ వాదులు చెబుతున్నా మాట. మరి కాపీ క్యాట్ గా ముద్ర వేసుకున్న కాంగ్రెస్ మున్ముందు ఎంకెన్ని పథకాలను కాపీ కొడుతుందో చూడాలి.

Also Read:Kalki:యాక్షన్ సీన్సే హైలైట్‌!

- Advertisement -