Bigg Boss 7 Telugu:షకీలా ఎంట్రీ!

86
- Advertisement -

బుల్లితెర బిగ్గెస్ట్ రియాల్టీ సో బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ మరికొద్ది రోజుల్లో ప్రారంభంకానుంది. ఇప్పటివరకు 6 సీజన్‌లకు మంచి స్పందన రాగా ఇక 7వ సీజన్‌ను ప్రేక్షకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక ఇప్పటికే ప్రారంభించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో ఇదే విషయాన్ని స్పష్టం చేశారు హోస్ట్ నాగార్జున. సరికొత్తగా ఈ సారి ఉండబోతుందని క్యూరియాసిటీ పెంచేశారు.

సెప్టెంబర్‌ 3న 7వ సీజన్ ప్రారంభంకానుండగా ‘ఉల్టా పుల్టా’ అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో గేమ్‌ షోను ప్లాన్‌ చేశారని సమాచారం. ఇక ఈసారి కంటెస్టెంట్స్‌లో అమర్‌ దీప్‌, కార్తీక దీపం ఫేమ్‌ శోభా శెట్టి, శ్వేతానాయుడు, సింగర్‌ మోహన భోగరాజు, సింగర్‌ శుభశ్రీ, సింగర్‌ దామిని, యూట్యూబ్‌ సెన్సేషన్‌ శీతల్‌ గౌతమన్‌ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక తాజాగా మరో పేరు తెరపైకి వచ్చింది. ప్రముఖ సినీ నటి షకీలా ఈ సీజన్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. శృంగార తారగా షకీల ఒకప్పుడు వెలుగు వెలిగింది. మలయాళంలో తెరకెక్కిన ఆమె చిత్రాలు అనేక భాషల్లోకి డబ్ అయ్యాయి. ప్రస్తుతం సినిమాలకు దూరమైన షకీలా బిగ్ బాస్ 7వ సీజన్‌లోకి అడుగుపెడుతున్నట్లు ప్రచారం జరుగుతుండగా దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Also Read:Prabhas:ఇంకెప్పుడు ప్రభాస్.. ఫ్యాన్స్ రెడీ?

- Advertisement -