ఆశ వర్కర్లకు సీఎం కేసీఆర్‌ వరాలు

260
Asha workers meets CM Kcr
- Advertisement -

ఆశా వర్కర్లకు జీతం ఇక నుంచి నెలకు ఆరువేలు ఇస్తున్నట్లు ప్రకటించారు సీఎం కేసీఆర్.  ప్రగతి భవన్‌లో ఆశా వర్కర్లతో సమావేశం నిర్వహించిన సీఎం  ఆశాలపై వరాల జల్లు కురిపించారు. ఆశావర్కర్లతోనే వెట్టిచాకిరి చేయిస్తున్నారని ఆ పరిస్ధితి మారాలని తెలిపారు. ఉద్యోగుల మంచి చెడు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని తెలిపారు.ఆశావర్కర్లు ఆత్మగౌరవంతో బతకాలని … అందరం సమానమే అని చెప్పారు.

ఆశావర్కర్లకు మరోసారి జీతం పెంచుతామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. గ్రామాల ఆరోగ్య బాధ్యతలను ఆశా వర్కర్లు తీసుకోవాలని వెల్లడంచారు. కేంద్రంతో సంబంధం లేకుండా ఆశా వర్కర్ల సేవలను రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని తెలిపారు. వచ్చే బడ్జెట్ నాటికి ఆశా వర్కర్లను అంగన్ వాడీ వర్కర్ల స్ధాయికి తీసుకెళ్తామని చెప్పారు. కేంద్రం ఐసీడీఎస్ నిధులను రూ. 18 వేల కోట్ల నుంచి 8 వేలకు తగ్గించిందని తెలిపారు.ఆశా వర్కర్లకు ఆశలు కల్పించి ప్రతిపక్షాలు గందరగోళం సృష్టించాయని విమర్శించారు. . ప్రభుత్వ ఆస్పత్రుల్లో కేసీఆర్ కిట్ల పంపిణీ బాధ్యత కూడా అప్పగించారు. గ్రామాల్లో ఆరోగ్య సంబంధమైన పనిని మాత్రమే ఆశావర్కర్లకు ఇవ్వటం జరుగుతుందని.. మిగతా పనులతో సంబంధం లేదన్నారు.

అస్తవ్యస్తంగా ఉన్న ఆశా వర్కర్ల వ్యవస్థను సరిదిద్దాలన్న సీఎం ఇకనుంచి ఆశా వర్కర్లు ఆరోగ్య సంరక్షకులు కావాలన్నారు.  ప్రభుత్వం దగ్గర మంత్రదండం లేదని ఒకదానిక తర్వాత ఒకటి సరిదిద్దుకుంటు పోతున్నామని వెల్లడించారు. ఏఎన్‌ఎం పోస్టు భర్తీలో ఆశావర్కర్లకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. ఆశా వర్కర్లు తమ విద్యార్హత వివరాలను డీఎంహెచ్‌వోకి ఇవ్వాలన్నారు. ఇకపై ఆశా వర్కర్లపై వేధింపులు ఉండవని స్పష్టం చేశారు. హెల్త్ విషయాల్లో గ్రామాల్లో సరైన అవగాహన లేదని వారిని చైతన్య పర్చాలని సూచించారు. అందరి సహకారంతో బంగారు తెలంగాణ సాధిద్దామని….ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్‌ గా తయారు కావాలన్నారు.

- Advertisement -