CM KCR:కేబినెట్ విస్తరణ

47
- Advertisement -

రేపు లేదా ఎల్లుండి మంత్రివర్గ విస్తరణ ఉండే అవకాశం ఉందని తెలిపారు సీఎం కేసీఆర్. కేబినెట్ లో ఉన్న ఖాళీని భర్తీ చేసే అవకాశం ఉండగా పార్టీకి వ్యతిరేకంగా ఎవరు ఏం చేసినా క్షమించేది లేదన్నారు.

ఎంత పెద్ద వాళ్ళైనా వదిలిపెట్టేది లేదని..పార్టీ నుంచి తీసి బయట పడేస్తాం అన్నారు. మైనంపల్లి హన్మంతరావు కు టికెట్ ఇష్టం లేకుంటే వెళ్లిపోవచ్చని…ఎవరైనా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందేనని తెలిపారు. 95 -105 సీట్లు మేము గెలుస్తాం అన్నారు.

7గురు సిట్టింగ్‌లను ఈ ఎన్నికల్లో మారుస్తున్నట్లు తెలిపారు సీఎం కేసీఆర్. కేవలం 4 స్థానాలకు తప్ప మిగితా అన్ని చోట్ల అభ్యర్థులను ప్రకటించారు. సీఎం కేసీఆర్ రెండు స్ధానాల నుండి బరిలోకి దిగనున్నారు. గజ్వేల్‌, కామారెడ్డి రెండు చోట్ల నుండి సీఎం కేసీఆర్ పోటీ చేయనున్నారు.

Also Read:అలాంటి వారికి.. కేసీ‌ఆర్ మాస్ వార్నింగ్!

- Advertisement -