సినీ నటుడు పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను చనిపోతే ఇండస్ట్రీలో ఎవరికీ తన శవాన్ని చూపించొద్దన్నారు. ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన పోసాని.. నాకు ఇప్పుడు ఎలాంటి దిగులు, బాధ లేవన్నారు. నేను సడెన్ గా చచ్చిపోయినా పర్లేదు. మా ఆవిడకు ఏడవొద్దని చెప్పాను అని తెలిపారు.
నేను బాగానే సంపాదించాను. సడెన్ గా నేను పోతే నా భార్య, పిల్లలు మేమేం చేయాలి అని బాధపడాల్సిన పని లేదు. నా పిల్లలకు కొంత ఆస్తి ఇచ్చేసాను. ఇక నా భార్య పేరు మీద 50 కోట్ల ఆస్తి ఉందన్నారు. నెలకు దాని పై దాదాపు 8 లక్షలు వస్తాయి. ఆ డబ్బులతో నా భార్య హాయిగా బతికేస్తుందన్నారు.
నేను చనిపోయాక నా మీద ఎవరూ సానుభూతి చూపించొద్దని.. నాకు 63 ఏళ్ళు, నా భార్యకు 60. నేను చచ్చిపోతే ఎలా ఉండాలో మా ఆవిడను ముందే ప్రిపేర్ చేసి ఉంచాను. ఎవరన్నా చుట్టాలు నన్ను చూడటానికి వస్తే ఇన్నేళ్లు నాతో లైఫ్ ఎలా ఉందో నవ్వుతూ వాళ్లకు చెప్పు అంతేగాని ఏడ్చి గగ్గోలు పెట్టొద్దు అని మా ఆవిడకు చెప్పానని తెలిపారు పోసాని. ఇప్పుడు పోసాని చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.
Also Read:CM KCR:మళ్లీ బీఆర్ఎస్దే అధికారం