- Advertisement -
రానున్న రోజుల్లో విపక్షాలకు సినిమా చూపిస్తాం అన్నారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన ఆయన…తెలంగాణ వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో ఇది 36వ ఫ్లై ఓవరని చెప్పారు.
ఈ స్టీల్ బ్రిడ్జికి నాయిని నర్సింహారెడ్డి బ్రిడ్జిగా నామకరణం చేశామన్నారు. దీంతో ప్రజల దశాబ్దాల కల నెరవేరిందఇ….నూతన సచివాలయానికి రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టుకున్నామన్నారు. దశాబ్దాలుగా కార్మిక నాయకుడిగా, రాష్ట్ర తొలి హోంమంత్రిగా పనిచేశారన్నారు.
విశ్వనగరంగా హైదరాబాద్ ఎదగాలనే కలకు పునాది పడిందని…కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంగా మళ్లీ కూర్చోబెట్టాలన్నారు. రానున్న రోజుల్లో ప్రతిపక్షాలకు సినిమా చూపిస్తామని వెల్లడించారు.
Also Read:ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు!
- Advertisement -