టీ న్యూస్ ప్రాపర్టీ ఎక్స్‌పో-2023

45
- Advertisement -

మీరు సొంత ఇల్లు లేక ప్లాట్ కొనాలనుకుంటున్నారా…? మీ పెట్టుబడికి సరైన ప్లేస్ కోసం ఎదురుచూస్తున్నారా.. అయితే మీకోసమే టీ న్యూస్ ప్రాపర్టీ ఎక్స్ పో, ఆగస్టు 19-20 హైటెక్‌సిటీ మైదాన్ ఎక్స్‌ పో సెంటర్ మాదాపూర్‌లో జరగనుంది. ప్రముఖ బిల్డర్స్ మరియు రియల్ ఎస్టేట్ సంస్థలు పాల్గొంటున్న టీ న్యూస్ ప్రాపర్టీ షోకి విచ్చేయండి.. అమూల్యమైన సలహాలతో సరైన నిర్ణయం తీసుకోండి.. మీ సొంతింటి కలను నెరవేర్చుకోండి.

రెండు రోజుల పాటు జరిగే ప్రాపర్టీ షోకి ప్రవేశం ఉచితం.ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు వందల సంఖ్యలో రియల్ ఎస్టేట్ కంపెనీలు సందేహాలను నివృత్తి చేయనున్నాయి.నగరాల్లో రోజు రోజుకి పెరిగిపోతున్న మధ్యతరగతి జనాభా వల్ల భారత రియల్ ఎస్టేట్ రంగం మరింతగా పుంజుకుంటుంది. అయితే,పెరుగుతున్న పోటీకి అనుగుణంగా పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ కంపెనీలు వెలుస్తున్నాయి. కొన్ని కంపెనీలు కస్టమర్లకు లాభాల పంటను పండిస్తుంటే మరికొన్ని నట్టేట ముంచేస్తున్నాయి.

Also Read:చిరు నిజంగానే పది కోట్లు వెనక్కి ఇచ్చేశారా?

ఈ క్రమంలో ఏయే ప్రాంతాల్లో కొత్తగా ఫ్లాట్ల నిర్మాణం ప్రారంభమైంది? ఎక్కడ డబుల్ బెడ్ రూమ్‌ ఫ్లాట్లు అమ్ముడవుతాయి? ట్రిపుల్ బెడ్‌రూం ఫ్లాట్లకు గిరాకీ ఉన్న ప్రాంతాలేవి? ఒక ఏడాదిలో అధిక స్టాకు (ఇండ్లు) అందుబాటులోకి వచ్చిన ప్రాంతమేది? ఇండ్ల సరఫరా తక్కువగా ఉండి.. డిమాండ్ అధికంగా ఉన్న ఏరియాలేవి?ఏ కంపెనీ చేపట్టిన వెంచర్లో ఫ్లాట్ కొనాలి..?అన్న సందేహాలను నివృత్తి చేయడానికి తెలంగాణ గుండె చప్పుడు టీ న్యూస్ చేపట్టిన ప్రాపర్టీ షో ఉపయోగపడనుంది. మంత్రి హరీష్ రావు ఈ ప్రాపర్టీ షోని ప్రారంభించనున్నారు.

- Advertisement -