‘మిస్టర్ ప్రెగ్నెంట్’…మంచి సినిమా

50
- Advertisement -

సయ్యద్ సోహైల్ రియాన్, రూపా కొడవాయుర్ జంటగా మైక్ మూవీస్ బ్యానర్ పై అప్పిరెడ్డి, వెంకట్ అన్నపరెడ్డి, రవీందర్ రెడ్డి సజ్జల నిర్మించిన సినిమా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’. న్యూ కాన్సెప్ట్ తో దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి ఈ చిత్రాన్ని రూపొందించారు. ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ మూవీ ఈ నెల 18న విడుదలవుతోంది. నైజాం ఏరియాలో ఈ సినిమాను ప్రముఖ పంపిణీ సంస్థ మైత్రీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. ఈ సందర్భంగా సినిమా హైలైట్స్ తెలిపారు దర్శకుడు శ్రీనివాస్ వింజనంపాటి

– మాది ఒంగోలు. సాఫ్ట్ ఇంజినీర్ గా పనిచేస్తుండేవాడిని. యూఎస్, కెనడాలో సాప్ట్ వేర్ కంపెనీల్లో పనిచేశాను. డైరెక్షన్ ఇంట్రెస్ట్ ఉండేది. కెనడాలో ఉన్నప్పుడు ఒక షార్ట్ ఫిలిం చేశాను. దానికి అవార్డ్ వచ్చింది. ఈ చిత్ర నిర్మాత రవీందర్ రెడ్డి సజ్జల నా మిత్రుడు. ఆయనకు ఈ సినిమా కథ చెప్పాను. రవీందర్ రెడ్డి ద్వారా అప్పిరెడ్డి గారికి స్టోరీ వినిపించాం. ఆయనకు కథ నచ్చి, వాళ్ల ఫ్యామిలీ తో పాటు ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ లోని వుమెన్ కొంతమందికి కథ చెప్పించారు. వాళ్లందరూ ఈ కథ విని ఎమోషనల్ అయ్యారు. అప్పిరెడ్డి గారిని ఈ సినిమా చేయమని వారంతా సజెస్ట్ చేశారు. అలా ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ ప్రాజెక్ట్ ఒకే అయ్యింది.

– ఈ సినిమాకు ముందు కొందరు పేరున్న హీరోలను అనుకున్నాం. ఎందుకంటే ఇందులో కొన్ని సీన్స్ పేరున్న హీరోలు చేస్తేనే బాగుంటుంది. నాని లాంటి హీరోలను ప్రయత్నించినా కుదరలేదు. విశ్వక్ సేన్ కు స్క్రిప్ట్ పంపించాం. సోహెల్ అప్పటికే నాకు ఫ్రెండ్. ఈ కథ గురించి అతనికి తెలుసు. ఈ స్టోరీ నేను చేస్తానంటూ చాలా సార్లు అడిగాడు. ప్రాజెక్ట్ సెట్ అయ్యేటప్పటికి తను బిగ్ బాస్ కు వెళ్లాడు. ఆ ప్రోగ్రాంలో అతనికి మంచి పేరొచ్చి ఫేమస్ అయ్యాడు దాంతో ఈ కథకు జస్టిఫై చేస్తాడని సోహైల్ తో మూవీ చేశాం. అతను చాలా మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. రూపా కొడవయూర్ తెలుగు అమ్మాయి కావడం వల్ల ఎమోషన్స్ చక్కగా పలికించింది. కళ్లతోనే ఎక్స్ ప్రెషన్స్ చూపించింది. ఆమె డాక్టర్ కావడం కూడా ఈ క్యారెక్టర్ కు అడ్వాంటేజ్ అయ్యింది.

– నా పర్సనల్ లైఫ్ లోని ఈవెంట్స్ కొన్ని ఈ చిత్ర కథ రాసేందుకు ఇన్స్ పైర్ చేశాయి. నా వైఫ్ ప్రీ మెచ్యూర్ బేబీకి జన్మనిచ్చింది. ఆ బేబీ బాగా చూసుకునేందుకు ఆమె ఎంత కష్టపడింతో ప్రత్యక్షంగా చూశాను. థామస్ అనే మేల్ ప్రెగ్నెంట్ యూఎస్ లో ఉన్నాడని పేపర్ లో చదివాను. అప్పటి నుంచి ఈ తరహా కథ ఒకటి రాయాలని ప్రయత్నాలు ప్రారంభించాను.

– ప్రెగ్నెన్సీ టైమ్ లో వుమెన్ కష్టాన్ని చూపిస్తే ఆర్ట్ ఫిలిం అవుతుంది. అలా కాకుండా ఈ సినిమాను కమర్షియల్ ఎలిమెంట్స్ తో మంచి లవ్ స్టోరితో కలిపి చేశాం. అయితే మేల్ ప్రెగ్నెంట్ అనగానే అందరు వింతగా రియాక్ట్ అవుతారు. ప్రేక్షకులు కూడా అలాగే మొదట సర్ ప్రైజ్ అవుతారు కానీ ఇందులోని ఎమోషన్స్ కు కనెక్ట్ అవుతారని నమ్ముతున్నాం. ఎవరైనా ఎక్స్ పర్మెంట్ చేసినప్పుడే కొత్త దారిలో వెళ్లగలం. నేను సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉన్నప్పుడు కూడా నా జాబ్ లో నా పని కొత్తగా ఉండాలనే ప్రయత్నించా.

– మైక్ మూవీస్ ప్రొడ్యూసర్స్ మూవీ మేకింగ్ లో అన్ని విధాలా నాకు సపోర్ట్ చేశారు. మంచి టెక్నీషియన్స్ ను ఇచ్చారు. కథ డిమాండ్ మేరకు ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఔట్ పుట్ చూశాక వారు సంతోషంగా ఉన్నారు. నేను కథ ఎలా చెప్పానో అలాగే బాగా తెరకెక్కించాని ప్రొడ్యూసర్స్ చెప్పడం హ్యాపీగా అనిపించింది. ఇవాళ 100 మంది ప్రెగ్నెంట్ వుమెన్ కు స్పెషల్ షో వేస్తున్నాం.

– ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాకు శ్రావణ్ భరద్వాజ్ మ్యూజిక్ అస్సెట్ అవుతుంది. అలాగే నిజార్ షఫీ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ పూడి ఎడిటింగ్ మంచి టెక్నికల్ సపోర్ట్ ఇచ్చాయి. మీరంతా ట్రైలర్ చూశారు. అందరికీ నచ్చింది. సినిమా మీద కూడా నమ్మకంతో ఉన్నాం. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మంచి సినిమా చేశామనే పేరొస్తుంది. ఇప్పుడే కాదు పదేళ్ల తర్వాత మా సినిమా చూసినా ఇష్టపడతారు. కాలేజ్ ఏజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు ప్రేక్షకులతా మా సినిమాకు కనెక్ట్ అవుతారు. క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ తర్వాత హీరో హీరోయిన్ల క్యారెక్టర్ లతో ప్రేక్షకులంతా ట్రావెల్ అవుతారు. ఇంటర్వెల్ బ్యాంగ్ కు గూస్ బంప్స్ వస్తాయి. క్లైమాక్స్ 45 మినిట్స్ సీట్స్ నుంచి కదలకుండా చూస్తారు. అమ్మాయి కోసం అబ్బాయి, అబ్బాయి కోసం అమ్మాయి చూడాల్సిన సినిమా ఇది. యూఎస్ లో 100 ఫ్లస్ థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది.

నెక్ట్ సినిమాకు డిస్కషన్స్ అవుతున్నాయి. పెద్ద ప్రాజెక్ట్ కు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కమర్షియల్ వేలోనే సినిమా చేస్తా. ఫ్యామిలీతో కలిసి చూసే సినిమాలే రూపొందిస్తాను. కొత్త ప్రాజెక్ట్ డీటెయిల్స్ త్వరలో చెబుతా అన్నారు.

Also Read:‘మట్కా’ కోసం హైదరాబాద్‌కు నోరా ఫతేహి!

- Advertisement -