- Advertisement -
వంగవీటి మోహన్ రంగా కుమారుడు వంగవీటి రాధా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. ఐదు పదుల వయస్సులో వివాహం చేసుకోనున్నారు రాధా. తన మిత్రుడు బంధువు కూతురితో రాధా వివాహం జరగనుంది.ఆగస్టు 19న నర్సాపురంలో ఎంగేజ్మెంట్ జరుగుతుందని.. సెప్టెంబర్ 6న వివాహం ముహూర్తం ఖరారు చేశారని తెలుస్తోంది.
రాధాకు కాబోయే భార్య ఎవరు? అనేది ఆసక్తిగా మారగా ఆమె ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నరసాపురంకు చెందిన అమ్మాయిగా తెలుస్తోంది. 2004లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు రాధాకృష్ణ. తర్వాత జరిగిన ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు రాధా. ఇక 2019 ఎన్నికలకు ముందు వైసీపీని వీడి టీడీపీలో చేరారు.
2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుండి రాధా బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇక రాధా పెళ్లి వార్తతో ఆయన అభిమానుల్లో సంతోషం నెలకొంది.
Also Read:అటల్…మీకు ‘సలాం’
- Advertisement -