విజయ్‌ – సమంతను ఆడుకుంటున్న నెటిజన్లు!

34
- Advertisement -

సమంత – విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం ఖుషి. మంగళవారం ఈ సినిమా మ్యూజిక్ కన్సెర్ట్ హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగింది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తుండగా సెప్టెంబర్ 1న పాన్ ఇండియా రిలీజ్ కాబోతుంది.

ఇక ఈ ఈవెంట్ సందర్భంగా ఖుషి సాంగ్స్ కి విజయ్ దేవరకొండ, సమంత కలిసి స్టేజి మీద డ్యాన్స్ వేశారు. కానీ విజయ్ షర్ట్ తీసేసి సమంతని ఎత్తుకొని చుట్టూ తిప్పుతూ హడావిడి చేస్తూ డ్యాన్స్ చేయడంతో ఈ వీడియోలు, ఫొటోలు వైరల్ గా మారాయి. ఇక విజయ్ డ్రెస్సింగ్‌ స్టైల్ కూడా రోతగా ఉండటంతో నెటిజన్లు తూర్పారబడుతున్నారు.

హీరో హీరోయిన్స్ లా కాకుండా ఈవెంట్స్ కి డ్యాన్స్ లు వేసే డ్యాన్సర్లులా చేశారని, డ్యాన్స్ చేయడానికి విజయ్ షర్ట్ ఎందుకు ఇప్పడం అని కామెంట్ చేస్తున్నారు. లైగర్ సినిమాకు ఇలాగే ఓవరాక్షన్ చేసి బొక్కబొర్లా పడ్డాడని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం వీరిద్దరి డ్యాన్స్ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read:TTD:విశ్వవ్యాప్తంగా సనాతన హిందూ ధర్మప్రచారం

- Advertisement -