ఆమె మరో సాయి పల్లవి అవుతుందా?

41
- Advertisement -

హిట్ ది ఏముంది..?, పాయల్ రాజ్ పుత్, ముమైత్ ఖాన్ లాంటి ఐటమ్ భామలకు కూడా హిట్లు పడ్డాయి. కానీ, వచ్చిన హిట్ ను నిలబెట్టుకోవాలి అంటే.. జడ్జ్ మెంట్ ఉండాలి. కెరీర్ పై ఎంతో అవగాహన ఉండాలి. అన్నిటికీ మించి అత్యాశకు పోకూడదు. ఈ విషయంలో వైష్ణవి చైతన్యను కచ్చితంగా మెచ్చుకోవాలి. బేబీ అనే సినిమా సూపర్ హిట్ అయ్యింది. ప్రతివారం ఎన్నో చిత్రాలు వస్తుంటాయి, పోతుంటాయి, కొన్ని పేర్లు కూడా గుర్తుండవు… బేబీ కొన్నాళ్ళు గుర్తు ఉంటుంది. కానీ ఆ గుర్తింపును నిలబెట్టుకునే దమ్ము వైష్ణవి చైతన్యకి ఉందా ?, యూట్యూబ్ వీడియోలు చేసుకునే ఈ పాప.. ఇండస్ట్రీలో నిలబడగలదా ? అని అనుమాన పడ్డారు కొందరు సినీ ప్రముఖులు.

కానీ, వైష్ణవి చైతన్య మాత్రం బలమైన కథలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. ఆమెకు ప్రస్తుతం వరుసగా అవకాశాలు వస్తున్నాయి. మొదట కథ వింటుంది. ఆ తర్వాత తన క్యారెక్టర్ పై మళ్లీ కూర్చుంటుంది. అప్పుడు కూడా తన మనసుకు ఆ కథ, ఆ క్యారెక్టర్ నచ్చితేనే సినిమాకి సైన్ చేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే వైష్ణవి చైతన్య ఐదు సినిమాలకు నో చెప్పింది. అరె.. కథల పై ఇంత కసరత్తులు చేస్తోంది కాబట్టి.. వైష్ణవి చైతన్యకి ఇండస్ట్రీలో లాంగ్ లైఫ్ ఉంటుంది.

Also Read:KTR:బీజేపీ వంద అబద్దాలు సీడీ ఆవిష్కరణ..

ఐతే, వైష్ణవి చైతన్య గురించి ఓ మాట చెప్పుకోవచ్చు… తనేమీ స్టన్నింగ్ బ్యూటీ కాదు… బేబీ సినిమాలో బాగా చేసినా అందులో వైష్ణవి చైతన్య పాత్ర ఆమె వయసుకు సంబంధించింది. కాబట్టి, పాత్రలో బాగా ఇన్ వాల్వ్ అయ్యింది. కానీ మిగతా పాత్రల్లో అంతే స్థాయిలో దూరిపోగలదా ?, చాలా అలవోకగా నటించగలదా ?, అఫ్‌కోర్స్ నటిగా తనకు కెమెరాలు, సినిమా వాతావరణం కొత్తేమీ కాదు… కానీ వయస్సొచ్చాక తన పాత్రను అర్థం చేసుకుని, జీవించడం ప్రతిభే కదా… ఈ విషయంలో కూడా వైష్ణవి చైతన్య సక్సెస్ అయితే, కచ్చితంగా ఆమె మరో సాయి పల్లవి అవ్వొచ్చు.

Also Read:Dulquer:’కింగ్‌ ఆఫ్‌ కోత’ బిగ్గెస్ట్ సినిమా

- Advertisement -