ఏపీలో సాధారణ ఎన్నికలు 2024 లో జరగాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని గత కొన్నాళ్లుగా విపరీతమైన చర్చ నడుస్తోంది. కానీ ముందస్తు ఎన్నికలపై వార్తలను జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు ఖండిస్తూనే వస్తోంది. కానీ ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ఏపీలో నియోజిక వర్గాల వారీగా ఎలక్షన్ అధికారులను నియమిస్తూ వచ్చింది. దీంతో ఎన్నికలకు చాలానే సమయం ఉన్నప్పటికి కేంద్రం ఇప్పుడేందుకు అధికారులను నియమిస్తోందనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీన్ని బట్టి చూస్తే ఏపీలో ముందస్తు ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రం కూడా ఆసక్తి చూపుతోందనే విషయం స్పష్టంగా అర్థమౌతోంది..
ఇక తాజాగా జగన్ నియోజిక వర్గ ఇంచార్జ్ లతోనూ, ఎమ్మెల్యేలతోనూ కీలక నేతలంతోనూ అత్యవసర సమావేశం నిరహించినట్లు పోలిటికల్ సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో ప్రతిఒక్క నేత ప్రజలతో మమేకం కావాలని పార్టీ నేతలకు దిశ నిర్దేశం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా పరిణామాలను బట్టి డిసెంబర్ లోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని కూడా పార్టీ నేతలకు క్లారిటీ ఇచ్చారట.
దీంతో తెలంగాణతో పాటే ఏపీలో కూడా ఎన్నికలు జరగవచ్చనే టాక్ వినిపిస్తోంది. అయితే అధికారికంగా జగన్ ముందస్తు ఎన్నికలపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికి ఏపీలోని తాజా పరిణామాలన్నీ ముందస్తు ఎన్నికలవైపే చూపిస్తున్నాయి. వచ్చే నెలలో సిఎం జగన్ కూడా ముందస్తు ఎన్నికలపై స్పష్టతనిఛే అవకాశం ఉందట. ఇప్పటికే టీడీపీ జనసేన పార్టీలు ముందుస్తు ఎన్నికలు గ్యారెంటీ అని పదే పదే చెబుతున్నాయి. ఇప్పుడు ఏకంగా సిఎం జగనే ముందస్తు ఎన్నికలపై క్లియర్ గా హింట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి ఒకవేళ ముందస్తు ఎన్నికలు జరిగితే వైసీపీ ఎంతవరుకు అనుకూలిస్తాయో చూడాలి.
Also Read:డీపీలు మార్చితే దేశ భక్తి పెరుగుతుందా.. మోడీజీ?