డిగ్గీ రాజాపై కేసు నమోదు..

227
Case against Digvijay Singh
- Advertisement -

ముస్లిం యువతను ఐసిస్ వైపు ప్రోత్సహించేలా తెలంగాణ పోలీసులు ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో దిగ్విజయ్‌పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డిగ్గీరాజా వ్యాఖ్యలపై తెలంగాణ పోలీసులు, మంత్రులతో పాటు బీజేపీ అగ్రనేతలు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ తీవ్రంగా ఖండించారు. పోలీసులు యువతను తీవ్రవాదం వైపు మళ్లేలా రెచ్చగొడుతున్నారనడానికి ఆధారాలు బయటపెట్టాలని నేతలు డిమాండ్ చేశారు.

ఈ నేపథ్యంలో దిగ్విజయ్ పై హైదరాబాద్  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తెలంగాణ పోలీసులపై అనుచిత వ్యాఖ్యల చేసిన దిగ్విజయ్ పై కేసు నమోదు చేయాలని ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ మంగళవారం (మే2) జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై న్యాయనిపుణుల సలహా తీసుకున్న పోలీసులు గురువారం (మే4) కేసు నమోదు చేశారు.

అయితే, తాను తెలంగాణ పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని ఏఐసీసీ జనరల్‌ సెక్రటరీ, తెలంగాణ, ఏపీ వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అంతేగాదు క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆయన తెగేసి చెప్పారు. ఈ విషయంపై ఎవరెన్ని కేసులు పెట్టుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు.

- Advertisement -