Pawan:ఓజీ ఫస్ట్ లుక్ అప్‌డేట్

37
- Advertisement -

సుజీత్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఓజీ. ఇప్పటికే మెజార్టీ షూటింగ్‌ కంప్లీట్ కాగా తొలుత డిసెంబర్‌లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం రిలీజ్ డేట్ మారినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది వేసవి కానుకగా సినిమాని రిలీజ్ చేయనుండగా తమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తోంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గాసిప్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. ఈ భారీ సినిమా నుంచి అవైటెడ్ ఫస్ట్ లుక్ సహా ఫస్ట్ గ్లింప్స్ లలో మొదట సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ వచ్చిన తర్వాతే సినిమా వీడియో ట్రీట్ ఇవ్వనున్నారట మేకర్స్.

ఫస్ట్ లుక్ ఈ ఆగస్ట్ 15న రావచ్చని ….గ్లింప్స్ వీడియో పవన్ బర్త్ డే కానుకగా సెప్టెంబర్ 2న విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

Also Read:బీరకాయ తింటే ఆ సమస్యలు దూరం!

- Advertisement -