- Advertisement -
బంగారం ధరలు ఇవాళ బులియన్ మార్కెట్లో తగ్గుముఖం పట్టాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 100 తగ్గగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గుముఖం పట్టింది. దీంతో ప్రస్తుతం హైదరాబాద్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 54,950గా ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 59,950కు చేరింది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 55,100 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 60,110గా ఉంది.
బంగారం బాటలోనే వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. ఇవాళ కేజీ వెండి ధర రూ. 600 తగ్గి.. రూ. 76,700కు చేరగా వెండి ధరలు గత మూడు రోజులుగా సుమారు రూ. 1800 తగ్గుముఖం పట్టాయి. ఆగస్టు 1వ తేదీన కేజీ వెడి ధర రూ. 81,000గా ఉండగా ఇప్పటి వరకు రూ. 4,300 తగ్గింది.
Also Read:యువతే టార్గెట్గా బీజేపీ ప్లాన్?
- Advertisement -