చంద్రబాబు ” మర్డర్ ప్లాన్ “..ఎవరిది?

40
- Advertisement -

టీడీపీ అదినేత చంద్రబాబు ఈ మద్య చేస్తున్న వ్యాఖ్యలు ఏపీ పోలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర దుమరాన్ని రేపుతున్నాయి. జగన్ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ విస్తృతంగా ప్రజల్లో పర్యటిస్తున్న బాబు.. తనదైన రీతిలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ పోలిటికల్ హీట్ పెంచుతున్నారు. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యాలు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయంగా మారాయి. అన్నమయ్య జిల్లా అంగళ్ళులో తనను చంపాలని చూశారని, అందుకు పోలీసులు కూడా సహకరించారని సంచలన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. ఇటీవల ప్రాజెక్ట్ ల సందర్శన పేరుతో చంద్రబాబు పోరు యాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే..

ఈ యాత్రలో భాగంగా అన్నమయ్య జిల్లా అంగళ్ళులో చంద్రబాబు రెచ్చగొట్టేలా ప్రసంగం చేశారని ఎఫ్ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఇందులో ఏ1 గా చంద్రబాబు, ఏ2 గా మాజీ మంత్రి దేవినేని ఉమా, ఏ3 గా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి.. వంటి వారితోపాటు మరికొందరి పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలో చంద్రబాబు పై విధంగా స్పందించారు. ఇక ఇటీవల పుంగనూరు పర్యటనలో కూడా హింసాత్మక పరిణామాలు చోటు చేసుకున్నా సంగతి విధితమే.

Also Read:KTR:ఐటీ హబ్‌తో ఉద్యోగాల సృష్టి

ఈ విధంగా చంద్రబాబు పర్యటనలో వరుసగా అల్లర్లు చోటు చేసుకోవడం వెనుక అసలు ప్లాన్ ఎవరిదనే చర్చ జరుగుతోంది. జగన్ దుర్మార్గపు పాలననే అల్లర్లకు కారణం అని చంద్రబాబు పదే పదే చెబుతున్నారు. అయితే ఈ అల్లర్లాన్ని చంద్రబాబు వ్యూహంలో భాగంగా జరుగుతున్నాయనేది వైసీపీ నేతలు చెబుతున్నా మాట. ఇటీవల పుంగనూల్ లో పోలీసులపై టీడీపీ కార్యకర్తలు దాడికి తెగబడడం చంద్రబాబు పథకమే అని డిప్యూటీ సి‌ఎం నారాయణ స్వామి చెప్పుకొచ్చారు. మొత్తానికి ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది ప్రధాన పార్టీల మద్య రాజకీయ వేడి పెరిగి ఘర్షణల వరకు దారి తీస్తుండడం కలవర పరిచే అంశం.

Also Read:Niranjan Reddy:కాంగ్రెస్‌కు పిండం పెడుతున్న రేవంత్

- Advertisement -