సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షంగా ఉందన్నారు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. నల్లగొండలో మీడియాతో మాట్లాడిన గుత్తా…ప్రతిపక్షాలు మాట్లాడుతున్న భాష ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమన్నారు. కేంద్రం ఒక్క మంచి పని కూడా చేయలేదని…తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదని స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిపిన ఘనత సీఎం కేసీఆర్‌ది అన్నారు. ఉద్యమ సమయంలో కన్న కలలు అన్నింటినీ సీఎం కేసీఆర్ సాకారం చేస్తున్నారని ….అలాంటి కేసీఆర్‌పై ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం సరికాదని హితవుపలికారు.
Also Read:వావ్.. ఎన్టీఆర్ న్యూ లుక్ అదిరింది
కాంగ్రెస్, బీజేపీ పార్టీలవి పగటి కలలుగానే మిగిలిపోతాయని…ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ పూర్తి చేశారని వెల్లడించారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం హర్షణీయమని ..కాంగ్రెస్ లీడర్లు ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నారని.. 50 ఏండ్లు అవకాశమిస్తే ఏం చేశారని నిలదీశారు.
Also Read:రేవంత్ ఏ పార్టీ లో ఉన్నా ఆ పార్టీ ఖతమే..