మోకాళ్ళ నొప్పులుంటే..నడవకూడదా?

55
- Advertisement -

నేటి రోజుల్లో మోకాళ్ళ నొప్పులతో బాధపడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. వయసుతో సంబంధం లేకుండా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్న వాళ్ళు ఎక్కువగా నడవలేక పోవడం, నిలబడలేక పోవడం వంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. మోకాళ్ళ నొప్పులు రావడానికి ప్రధాన కారణం శరీరంలో విటమిన్ డి లోపం ఉండడం, ఇంకా సరైన వ్యాయామం లేకపోవడం, అధిక బరువు.. వంటివి ప్రధాన కారణాలు గా చెప్పుకోవఛ్బు. కాగా మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఎక్కువగా నడవరాదని, అలా చేయడం వల్ల ఆ సమస్య మరింత ఎక్కువ అవుతుందనే అపోహ చాలమందిలో ఉంది. అయితే అది ఒట్టి అపోహ మాత్రమే. మోకాళ్ళ నొప్పులు ఉన్న వారికి వాకింగే నివారణ మార్గమని నిపుణులు చెబుతున్నారు.

క్రమం తప్పకుండా వాకింగ్ చేయడం వల్ల కండరాలు మరియు మోకాళ్ళ యొక్క కీళ్ళు బలపడతాయి. అంతే కాకుండా వాకింగ్ చేయడం వల్ల శరీరంలోని కెలోరీలు కొవ్వు కరిగి వేగంగా బరువు తగ్గుతారు. తరచూ వాకింగ్ చేయడం వల్ల మోకాళ్ళ ఫ్లెక్సిబిలిటీ కూడా పెరుగుతుంది. వయసు పైబడిన వారు నడవడానికి ఇబ్బంది పడుతుంటారు. అయినప్పటికి నడవడం అలవాటు చేసుకుంటే వారిలో ఎండార్ఫిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఈ హార్మోన్ కారణంగా రోజంతా ఉత్సాహంగా ఉంటారు. ఇంకా ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా దురమౌతాయి. తద్వారా మానసికంగా ఉత్సాహంగా ఉండడమే కాకుండా అన్నీ ఆవాహవాలకు రక్తప్రసరణ కూడా మెరుగుపడుతుంది. కాబట్టి ప్రతిరోజూ నడకకే అధిక ప్రదాన్యం ఇవ్వాలని నిపుణులు చెబుతున్నారు.

Also Read:టీ కాంగ్రెస్ బిగ్ ప్లాన్.. బరిలోకి సోనియా?

- Advertisement -